అంతర్జాతీయం

2024 చివ‌రికి ప్ర‌పంచ జ‌నాభా 8 వందల కోట్లు దాటింది …

  • ప్ర‌పంచ జ‌నాభా 2024 చివ‌రికి 800.09 కోట్ల‌కు చేరుకున్న‌ట్లు యూఎస్ సెన్స‌స్ బ్యూరో వెల్ల‌డి
  • జ‌నాభాలో 0.9 శాతం (7.1 కోట్లు) పెరుగుద‌ల న‌మోదైంద‌న్న‌ బ్యూరో
  • గ‌తేడాది (7.5 కోట్లు)తో పోలిస్తే స్వ‌ల్ప త‌గ్గుద‌ల
  • 2025లో ప్ర‌తి సెక‌నుకు 4.2 జ‌న‌నాలు, 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యే అవ‌కాశం 
  • ఈ ఏడాది 26 ల‌క్ష‌లు పెరిగి 34.1కోట్ల‌కు చేరిన అమెరికా జ‌నాభా

ప్ర‌పంచ జ‌నాభా 2024 చివ‌రి నాటికి 7.1 కోట్లు పెరిగి 800.09 కోట్ల‌కు (8,092,034,511) చేరుకున్న‌ట్లు యూఎస్ సెన్స‌స్ బ్యూరో అంచ‌నా వేసింది. మొత్తానికి 0.9 శాతం పెరుగుద‌ల న‌మోదైంద‌ని బ్యూరో తెలిపింది. అయితే, గ‌తేడాది (7.5కోట్లు)తో పోలిస్తే స్వ‌ల్ప త‌గ్గుద‌ల ఉంద‌ని పేర్కొంది. కాగా, 2025లో ప్ర‌తి సెక‌నుకు 4.2 జ‌న‌నాలు, 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.  

ఇక అమెరికా జ‌నాభా 26 ల‌క్ష‌లు పెరిగి 34.1కోట్ల‌కు (341,145,670) చేరుకుంటుందని యుఎస్ సెన్సస్ బ్యూరో వెల్ల‌డించింది. జనవరి నుంచి ఈ ఏడాది చివ‌రికి 0.78 శాతం (26,40,171) పెరుగుదల న‌మోదైంద‌ని పేర్కొంది. అలాగే 2025లో దేశంలో 9 సెక‌న్ల‌కు ఒక జ‌న‌నం, 9.4 సెక‌న్ల‌కో మ‌ర‌ణం న‌మోద‌వ్వ‌చ్చ‌ని సెన్స‌స్ బ్యూరో అంచ‌నా వేసింది. కాగా, అంతర్జాతీయ వలసలు ప్రతి 23.2 సెకన్లకు యూఎస్‌ జనాభాకు ఒక వ్యక్తిని జోడించగలద‌ని తెలిపింది.

Related posts

అమెరికా విద్యార్థి వీసా నిబంధనలు కఠినతరం.. భారత విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం?

Ram Narayana

దావోస్‌లో కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఆ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్…

Ram Narayana

ఎన్నికలు ప్రకటించగానే బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా!.. ఆమె కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana