Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

అవసరమున్నవే తెరవాలి..లేదంటే మూడో వేవ్​ ముప్పు: సీఐఐ అధ్యక్షుడు టి.వి. నరేంద్రన్…

అవసరమున్నవే తెరవాలి..లేదంటే మూడో వేవ్​ ముప్పు: సీఐఐ అధ్యక్షుడు టి.వి. నరేంద్రన్
-సామాజిక కార్యక్రమాలు ఇప్పుడే వద్దు
-ఏప్రిల్, మే నెలలో ఆర్థిక వ్యవస్థ పట్టుతప్పింది
-జీఎస్టీ వసూళ్లు తగ్గడమే నిదర్శనం

దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉండాలంటే.. ప్రభుత్వాలు జాగ్రత్తగా లాక్ డౌన్ ను ఎత్తేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) నూతన అధ్యక్షుడు టి.వి. నరేంద్రన్ అన్నారు. అవసరమున్న వాటినే తెరవాలని ఆయన సూచించారు. లేదంటే మూడో వేవ్ ముప్పును కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు.

‘‘ఒకేసారి అన్నింటినీ ఓపెన్ చేయడం సరికాదు. ఏవి అవసరమో.. ఏవి అవసరం లేదో ఓ జాబితా సిద్ధం చేసుకోవాలి. అందుకు తగ్గట్టు అవసరమున్న వాటిని ఓపెన్ చేసి.. మిగతా వాటిని మూసే ఉంచడం మంచిది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే కార్యకలాపాలను మాత్రం ఇప్పుడు ప్రారంభిస్తే చాలు. సామాజిక కార్యక్రమాల ప్రారంభానికి మరికొన్ని నెలలు ఆగినా ఫర్వాలేదు. అలాగైతేనే థర్డ్ వేవ్ ముప్పును తగ్గించగలుగుతాం’’ అని ఆయన అన్నారు.

ఏప్రిల్, మేలో ఆర్థిక కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోయాయన్నారు. స్థానిక లాక్ డౌన్ ల వల్ల చాలా మందిపై ప్రభావం పడిందన్నారు. దాని వల్ల జీఎస్టీ వసూళ్లూ తగ్గాయన్నారు. గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ.. సెకండ్ వేవ్ తో మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్ దాకా రోజూ సగటున 71.2 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తేనే మొత్తం పెద్దవారందరికీ టీకా వేయగలుగుతామన్నారు. అప్పుడే ముప్పు నుంచి బయట పడవచ్చన్నారు.

థర్డ్ వెవ్ పై నిపుణుల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తు వేస్తుండటంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి . అయితే ప్రజలనుంచి కూడా వత్తిడి రావడం ,ఆదాయాలు కోల్పోవడంతో ప్రభుత్వాలు లాక్ ఎత్తివేస్తున్నాయి . భారత్ లో కేసుల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఆక్సిజన్ కొరత ,మందుల కొరత , వ్యాక్సిన్ల కొరత తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు . ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తి వేయడం లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు అందుతున్నాయి .

Related posts

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది: కేటీఆర్

Drukpadam

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా!

Drukpadam

ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్ .. ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక!

Drukpadam

Leave a Comment