Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా …సొంతపార్టీ నుంచే తిరుగుబాటు!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా …సొంతపార్టీ నుంచే తిరుగుబాటు
మార్చ్ 24 వరకు పార్లమెంట్ ప్రోరోగ్ చేయాలనీ గవర్నర్ కు సిఫార్స్
గత కొంత కాలంగా ట్రూడో పై తీవ్ర స్థాయిలో విమర్శలు
మరి కొద్దీ నెలల్లోనే పార్లమెంటుకు ఎన్నికలు
మద్దతు ఇచ్చే పార్టీల ఉపసంహరణ
ఆర్ధికమంత్రి రాజీనామా …ట్రూడో విధానంపై ధ్వజం

  • లిబరల్ పార్టీలో ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత
  • ఈ నెల 8న లిబరల్ పార్టీ కాకస్ మీటింగ్

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు …ఈ విషయాన్నీ ఆయన స్వయంగా వెల్లడించారు …గత కొంతకాలంగా ఆయన తన సొంతపార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు …దీంతో ఆయన పదవికి రాజీనామా చేయక తప్పలేదు …ఒక వేళ ఆయన తప్పుకోకపోతే ఆయన పార్టీ సమావేశమై తొలగించడానికి సిద్ధపడ్డ నేపథ్యంలో గౌరప్రదంగా తప్పుకున్నారు …భారత్ తో సంబంధాలు దెబ్బతినడం ,ట్రాంప్ కెనడా విషయంలో చులకనగా మాట్లాడటం దేశంలో నిరుద్యోగం పెరగటం ఉపాధి అవకాశాలు దెబ్బతినడం ఆర్ధిక విధానాలు ఆయన పట్ల వ్యతిరేకతను పెంచాయి…దీంతో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎన్డీపీ మద్దతు ఉపసంహరించుకున్నది ….మరికొద్ది నెలల్లో పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళితే ఇబ్బందులు తప్పవని పార్టీ అభిప్రాయపడింది ..ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి తన పదవికి రాజీనామా చేసి ట్రూడో విధానాలను దుయ్యబట్టారు …ట్రూడో రాజీనామా చేస్తూ పార్లమెంట్ ను ప్రోరోగ్ చేయాలనీ గవర్నర్ కు సిఫార్స్ చేయడం కొసమెరుపు …

. పార్టీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడం, వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్న అంచనాల నేపథ్యంలో ట్రూడో రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 8న లిబరల్ పార్టీ కాకస్ మీటింగ్ జరగనుంది. ఈలోపే పార్టీ పదవికి ట్రూడో రాజీనామా చేస్తారని, లేదంటే పార్టీ మీటింగ్ లో నేతలే ఆయనకు ఉద్వాసన పలికే పరిస్థితి ఉందని సమాచారం.

పార్టీ మీటింగ్ లో అవమానకరరీతిలో తొలగింపబడడం కన్నా ముందే తప్పుకోవడం గౌరవంగా ఉంటుందనే భావనతో ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే విషయంపై కెనడా ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ తో ట్రూడో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈమేరకు కెనడా మీడియా ఆదివారం కథనాలు ప్రచురించాయి.

ట్రూడో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ప్రధానిగా కొనసాగుతారా? లేక రెండింటికీ రాజీనామా చేస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా ట్రూడో పదేళ్లకు పైగా కొనసాగుతున్నారు. మరోవైపు, వచ్చే అక్టోబర్ లోగా కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితిలో ట్రూడో రాజీనామా చేస్తే లిబరల్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికల రేసులో కన్జర్వేటివ్ పార్టీ ముందంజలో ఉందని, లిబరల్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే పార్టీకి మరింత మైనస్ కానుందనే అభిప్రాయాలు లిబరల్ పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

Related posts

అదే జరిగితే అణుబాంబు ప్రయోగిస్తాం.. పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక!

Ram Narayana

గన్నులతో వచ్చి కెమెరాలు తీసుకుని వెళ్లిపొమ్మన్నారు.. ఆల్ జజీరా ఆఫీసులో ఇజ్రాయెల్ సోల్జర్ల దాడి

Ram Narayana

అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. రష్యాకు దారి మళ్లింపు…

Ram Narayana

Leave a Comment