తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు!

  • ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • బుద్ధ భవన్‌లోని బీ-బ్లాక్‌లో త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
  • ఇప్పటికే హైడ్రాకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ గెజిట్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని బుద్ధ భవన్ బీ-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, ఇతర ఆస్తులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అయితే, హైడ్రా ఏర్పాటుపై ప్రశ్నలు వచ్చాయి. దీంతో జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరించారు. చెరువులు, ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో 374 బీ సెక్షన్‌ను చేర్చారు.

Related posts

అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

Ram Narayana

పార్లమెంట్ లో కేసీఆర్ అవమానించిన బండి సంజయ్ పై స్పీకర్ ఏమి చర్యలు తీసుకుంటారు …!

Ram Narayana

గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

Ram Narayana