- జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో మోదీ పాడ్‌కాస్ట్
- 2014లో ప్రధాని అయ్యాక జిన్‌పింగ్ నుంచి మోదీకి ఫోన్‌కాల్
- మోదీ స్వగ్రామమైన వాద్‌నగర్‌ను సందర్శిస్తానన్న చైనా అధ్యక్షుడు
- అక్కడికే ఎందుకంటే ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్న చైనా అధ్యక్షుడు
- అనుకున్నట్టే 2014 సెప్టెంబర్ 17న వాద్‌నగర్ సందర్శన
జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో జరిగిన తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుజరాత్‌లోని తన స్వగ్రామం వాద్‌నగర్‌కు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గ్రామానికి మధ్య చారిత్రక సంబంధం ఉందని వెల్లడించారు. ఈ సంబంధం వెనక చైనీస్ తత్వవేత్త, యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ ఉండటం విశేషం.
‘‘2014లో నేను ప్రధానమంత్రిని అయ్యాక ప్రపంచ నేతలు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి అభినందించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఫోన్ చేశారు. తాను ఇండియాకు రావాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ‘మీకు స్వాగతం, మీరు తప్పకుండా రావాలి’ అని నేను ఆహ్వానించాను. అప్పుడాయన స్పందిస్తూ గుజరాత్‌లోని మా స్వగ్రామం వాద్‌నగర్‌కు రావాలని అనుకుంటున్నట్టు చెప్పారు’’ అని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
జిన్‌పింగ్ అలా చెప్పడంతో ఆశ్చర్యపోయిన మోదీ.. అదే విషయమై ఆయనను ప్రశ్నించారు. దీనికి జిన్‌పింగ్ బదులిస్తూ హ్యూయెన్ త్సాంగ్ వాద్‌నగర్‌లో చాలా కాలం పాటు నివసించారని చెప్పడంతో ఆశ్చర్యపోవడం తన వంతైందని పేర్కొన్నారు. ఇండియా నుంచి వచ్చిన హ్యూయెన్ త్సాంగ్ ఆ తర్వాత తన గ్రామంలో నివసించారని చైనా అధ్యక్షుడు చెప్పారని గుర్తు చేసుకున్నారు. వాద్‌నగర్‌కు, తనకు మధ్య ఉన్న సంబంధం అదేనని ఆయన చెప్పారని వివరించారు. ఆ తర్వాత అనుకున్నట్టుగానే 2014 సెప్టెంబర్ 17న మోదీ 64వ బర్త్‌డే సందర్భంగా జిన్‌పింగ్ గుజరాత్‌ను సందర్శించారు.