Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇకనుంచి హన్మకొండ ,వరంగల్ జిల్లాలు గానే పిలుద్దాం కేసీఆర్

ఇకనుంచి హన్మకొండ ,వరంగల్ జిల్లాలేగానే పిలుద్దాం కేసీఆర్
వరంగల్ అర్బన్ ,రురల్ జిల్లాలు పేరుమార్పు :కేసీఆర్
మంత్రుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం
రెండుమూడు రోజుల్లో జి లు
హర్షం వ్యక్తం చేసిన మంత్రులు
వరంగల్ పర్యటనలో ప్రారంభోత్సవాలు , శంఖుస్తాపనలు కేసీఆర్ బిజీ బిజీ

జిల్లాల పునర్విభజనలో రాష్ట్రంలో కొత్తగా అనేక జిల్లాలు వచ్చి చేరాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా ఐదు జిల్లాలుగా విడిపోయింది. వరంగల్ అర్బన్ , రూరల్ జిల్లాలు కూడా అందులో ఉన్నాయి. రూరల్ ,అర్బన్ జిల్లాలుగా మార్చడం పై అప్పట్లోనే అభ్యంతరాలు ఉన్నాయి. చాలాకాలంగా ప్రజలు,ప్రజా ప్రతినిధుల నుంచి ప్రభత్వానికి విజ్ఞప్తులు అందాయి.అయినప్పటికీ ఇప్పటి వరకు ఇంలాంటి నిర్ణయం తీసుకోలేదు . కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ లు , ఎంపీ లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విజ్ఞపి చేశారు. దానికి స్పందించిన ముఖ్యమంత్రి వరంగల్ అర్బన్ కలెక్టరేట్ సముదాయం ప్రారంభోత్సవ సందర్బాగా జరిగిన సభలో వరంగల్ రూరల్ ,అర్బన్ జిల్లాల పేర్లు మార్చుతున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి హన్మకొండ , వరంగల్ జిల్లాలుగా మార్చుతున్నట్లు ప్రకటించారు. దీనిపై రెండుమూడు రోజుల్లోనే ఉత్తర్వులు అందుతాయని ప్రకటించారు. నేడు ప్రారంభించిన అర్బన్ జిల్లా కలెక్టరేట్ ను హన్మకొండ జిల్లాగా పరిగణించాలని సభలోనే తెలిపారు.ఇక నించి వరంగల్ రూరల్ జిల్లా వరంగల్ జిల్లాగా పిలవాలని అన్నారు. త్వరలోనే రూరల్ జిల్లాకు కూడా కొత్త భవనం నిర్మాణం జరుగుతుందని అన్నారు . హన్మకొండకు ఆధునాతన హంగులతో కొత్త కలెక్టరేట్ ప్రారంభించుకోవడం ఆనందముగా ఉందని అన్నారు.

వరంగల్ కు వెటర్నరీ కాలేజీ మంజూరి చేశామని అంటూ వరంగల్ హైద్రాబాద్ కు ఏమాత్రం తీసిపోదని ఇది హెల్త్ హబ్ గా మారాలని అన్నారు. అంతకు ముందు హైద్రాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా హైద్రాబాద్ నుంచి వరంగల్ వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రులు ,ఎంపీలు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు . అనంతరం సీఎం కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అక్కడే కాళోజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరంగల్ సెంట్రల్ జైలు ప్రాగణంలో నిర్మించనున్న మల్టి స్పెషాలిటీ ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు.

 

Related posts

రూ.8 లక్షల ఆదాయం ఉన్న వారిని పన్ను నుంచి మినహాయించాలి: మద్రాస్ హైకోర్టులో పిటిషన్!

Drukpadam

ఐజేయూ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ కన్నుమూత

Drukpadam

కాలినడకన వెళ్లే భక్తులకు చేతికర్ర… భూమన….!

Ram Narayana

Leave a Comment