Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

కాబోయే సీఎం లోకేశ్ అంటూ జ్యూరిచ్ లో మంత్రి భరత్ ప్రసంగం… మండిపడిన చంద్రబాబు!

  • దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తదితరులు
  • జ్యూరిచ్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
  • కాబోయే సీఎం లోకేశ్ అంటూ భరత్ వ్యాఖ్యలు
  • ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం 

స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసింది. భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేశ్ గారే అంటూ భరత్ ప్రసంగించారు. ఎవరు కాదన్నా ఇది జరిగి తీరుతుందనే కోణంలో ఆయన వ్యాఖ్యానించారు. 

ఇదే వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు… మంత్రి భరత్ పై మండిపడ్డారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని హెచ్చరించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు… మనం వచ్చిన పనేమిటి… మీరు మాట్లాడుతున్నదేమిటి… అసందర్భ ప్రసంగాలు చేయొద్దని మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని స్పష్టం చేశారు. 

కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

Related posts

మళ్ళీ మాదే అధికారం…సజ్జల

Ram Narayana

రాజమండ్రి జైల్లో భారీ భద్రత.. ఆ బ్లాక్‌లోకి వెళ్లాలంటే చంద్రబాబు అనుమతి తప్పనిసరి!: సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు

Ram Narayana

ఏపీ మంత్రి సురేశ్ సతీమణిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు…

Ram Narayana

Leave a Comment