Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. సమాధానాలు దొరకని చిక్కు ప్రశ్నలు ఇవే!

  • సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది తెల్లవారుజామున 2.30 గంటలకు
  • ఆసుపత్రికి వెళ్లింది మాత్రం 4.11 గంటలకు
  • ఈ గ్యాప్‌లో ఇంట్లో సైఫ్ ఏం చేశారన్నది ప్రశ్న 
  • భర్తతోపాటు కరీనా ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేదన్నది డౌటు 
  • సైఫ్‌పై దాడి జరిగింది కత్తితో కాదా? అంటూ మరో అనుమానం 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో బోల్డన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఘటన జరిగి పది రోజులు దాటినా కొన్నింటికి సమాధానాలు లభించడం లేదు. ఈ విషయంలో అటు సైఫ్ కుటుంబ సభ్యుల నుంచి కానీ, ఇటు ఆయన చికిత్స చేయించుకున్న లీలావతి ఆసుపత్రి నుంచి కానీ పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోతున్నారు. 

  • బాంద్రా పోలీసులకు లీలావతి ఆసుపత్రి డాక్టర్ భార్గవి పాటిల్ సమర్పించిన మెడికో లీగల్ నివేదిక ప్రకారం సైఫ్ అలీఖాన్‌పై జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకునేందుకు పట్టేది 10 నిమిషాలు మాత్రమే. కానీ, సైఫ్ 4.11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నాడు. శరీరంలో ఆరు చోట్ల కత్తిపోటు గాయాలు అయినా, దాదాపు 2 గంటలపాటు సైఫ్ ఇంట్లో ఏం చేసినట్టు? అన్నప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.  
  • ఆయనకు అయిన గాయాల్లో ఒకటి వెన్నుపూసకు దగ్గర్లో 2.5 అంగుళాల లోతు ఉన్నట్టు వైద్యులు చెప్పారు. వెన్నులో పదునైన లోహపు ముక్కలు ఉండిపోయినప్పటికీ, మరోపక్క వెన్ను నుంచి రక్తం కారుతున్నప్పటికీ సైఫ్ అంతసేపు ఎలా తట్టుకోగలిగాడు? 
  • ఆటోలో సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు మరో వ్యక్తితోపాటు సైఫ్ కుమారుడు తైమూర్ (7) కూడా న్నాడు. అయితే, సైఫ్ ఆసుపత్రిలో చేరిన సమయానికి, ఆటో డ్రైవర్ చెబుతున్న దానికి మధ్య పొంతన కుదరడం లేదు. 
  • సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఆయన భార్య కరీనా ఇంట్లో ఉన్నారా? కింది అంతస్తులో గొడవ విని పైనుంచి కరీనా కిందికి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు చెబుతున్నారు. ఆమె నిజంగానే ఇంట్లో ఉండి ఉంటే భర్తతోపాటు ఆసుపత్రికి ఎందుకు రాలేదు? 
  • ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా పిల్లలను ఆయాల వద్ద వదిలిపెడుతుంది. కానీ, కరీనా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అంతకుముందు ఆమె పార్టీకి వెళ్లి రావడంతో సైఫ్‌తో ఆసుపత్రికి వెళ్లే స్థితిలో లేరా?
  • సైఫ్ శరీరంలో ఇరుక్కుపోయిన కత్తి ముక్కలను తొలగించేందుకు దాదాపు ఆరు గంటలు పట్టిందని వైద్యులు చెప్పారు. అంతేకాదు, తొలగించిన ముక్కల ఫొటోలు కూడా చూపించారు. పోలీసులకు డాక్టర్ పాటిల్ ఇచ్చిన నివేదికలో ఈ ముక్కల వల్లే గాయాలు అయినట్టు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టులో మాత్రం దాడి కత్తితో జరిగింది కాదని, పదునులేని ఆయుధం వల్లే జరిగిందని చెబుతున్నారు. మరి కత్తితో జరిగిన దాడిగా చెబుతున్న దాంట్లో నిజమెంత?  
  • సైఫ్ ఇంట్లోకి చొరబడినట్టుగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాంను మొదట ఎదుర్కొన్న ఆయాలలో ఒకరు నిందితుడి వద్ద కత్తితోపాటు చెక్క రాడ్డు లాంటిది ఉందని చెప్పారు. ఆ రాడ్డు వల్లే గాయాలయ్యాయా?
  • భర్త సైఫ్‌ను రక్షించేందుకు కరీనా కపూర్ ప్రయత్నించారా? అదే జరిగితే ఆయాకు అయినట్టు ఆమెకు గాయాలు ఎందుకు కాలేదు? 
  • సైఫ్ అలీఖాన్ కానీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ ఉత్తమణి కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దీంతో ఈ విషయంలో ఇంకేమైనా జరిగిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Related posts

రైతుల ‘ఢిల్లీ ఛలో ’లో ఉద్రిక్తత.. మరోసారి ర్యాలీ నిలిపివేత

Ram Narayana

అహమ్మదాబాద్ – ఢిల్లీ మధ్య దూసుకుపోనున్న బుల్లెట్ ట్రైన్..!

Ram Narayana

మణిపూర్ హింస రాజ్య ప్రేరేపితమే…అనీరాజా….

Ram Narayana

Leave a Comment