Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదు.. మంత్రి శ్రీధర్‌ బాబు

ఉద్యోగుల పదవి విరమణ వయస్సు ఇప్పుడున్న 61 నుంచి 65 సంవత్సరాలకు ప్రభుత్వం పెంచబోతుందని వస్తున్నా వార్తలపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు …ఆలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు … ఫిబ్రవరి 7న ఐటీకి సంబంధించి పెద్ద ప్రకటన ఉండబోతోందని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో శ్రీధర్‌బాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డ్రైపోర్టు లింక్‌ పరిష్కారమైందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారని తెలిపారు. తెలంగాణలో రెండు డ్రైపోర్ట్‌లు వస్తున్నాయన్నారు. టైర్‌-2 సిటీల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీకి సంబంధించి ఈస్ట్‌ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. చర్లపల్లి వద్ద పెద్దఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ఐటీ పాలసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త పాలసీని తీసుకొస్తామని వివరించారు. హైదరాబాద్‌ చుట్టూ ఐటీ అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే అధికంగా ఈఏడాదిలోనే వచ్చాయని చెప్పారు. వీటిని గ్రౌండ్‌ చేయడానికి ఇప్పటికే దృష్టి సారించినట్లు వివరించారు. హైదరాబాద్‌ చుట్టూ మాల్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. మంత్రులు ఎవరు అలక, అసంతృప్తిలో లేరన్న ఆయన ఆర్థిక పరిస్థితిపై అందరికీ అవగాహన ఉందన్నారు. అవినీతి ఆరోపణలు నిజం కాదని మంత్రి పేర్కొన్నారు.

వాళ్లు చాలా వ్యూహాత్మకంగా ఉన్నారు… ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని చంద్రబాబుది విశాల దృక్పథమని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. చంద్రబాబు చాలా పెద్ద ప్రణాళికలతో దావోస్‌ వచ్చారన్న ఆయన ఇప్పటికే పలు ఎంఓయూలు చేసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అపార వనరులు ఉన్నాయని, విస్తారమైన సముద్రతీర ప్రాంతం ఉండడంతో అక్కడ మంచి పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. అయితే ఎంఓయూలు చేసుకున్న వాటి గురించి దావోస్‌లో ఎందుకు ప్రకటించలేదని ఏపీ ఐటీశాఖ మంత్రి లోకేశ్‌ను అడిగారని అందుకు ఆయన ఆ వివరాలన్ని తమ రాష్ట్రంలోనే చెబుతామని అన్నారని చెప్పారు. దీని ప్రకారం చూస్తే వాళ్లు పెట్టుబడుల విషయంలో వ్యూహాత్మకంగా ఉన్నారని తెలిపారు.

ఈ వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉన్నారు… ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుకూలతలు, పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అల్టిమేట్ అన్నారు. ఆయన మాటలు చాలా పెద్దరికంగా ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌ను డిస్టర్బ్‌ చేసే మూడ్‌లో ఆయన లేరని, నగరం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. దావోస్‌లో మైనస్‌ 8 నుంచి మైనస్‌ 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయని, తామంతా స్వెటర్లు, జాకెట్లు వేసుకుంటే చంద్రబాబు మాత్రం సాధారణ దుస్తుల్లోనే ఉన్నారని చెప్పారు. ఈ వయసులో కూడా ఆయన చాలా ఫిట్‌గా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు…

Related posts

మరో నెల రోజులు జైలులోనే కవిత.. కారణం ఇదే!

Ram Narayana

ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన కాశేళ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కుంగుబాటు..

Ram Narayana

సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టుల గోడు వినండి …! టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ…

Ram Narayana

Leave a Comment