- మంత్రి వర్గ ఉపసంఘానికి రేపు అందనున్న కుల గణన నివేదిక
- కుల గణన నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రి వర్గం
- కుల గణన నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రభుత్వం కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కుల గణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కుల గణన నివేదిక రేపు మంత్రివర్గ ఉపసంఘానికి అందుతుందని తెలిపారు. అనంతరం, ఈ నెల 5న మంత్రివర్గం ముందు కుల గణన నివేదికను ఉంచుతామని చెప్పారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత కుల గణన నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని అన్నారు. ఇందుకోసం ఈ నెల 5న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని ఆయన వెల్లడించారు.