Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎమ్మెల్యేల రహస్య భేటీ…కాంగ్రెస్ లో పరేషాన్…రంగంలోకి సీఎం రేవంత్ !

తెలంగాణ రాష్ట్రంలో అధిక కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అవ్వడం ఆపార్టీలో ప్రకంపనలు పుట్టిస్తుంది …దీనిపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం….ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత లేకపోగా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది …ఇందులో నిజమెంత ఉందో తెలియదు గని ఒక మంత్రిని టార్గెట్ గా ఆసమావేశం జరిగిందని ప్రచారం జరుగుతుంది… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవిషయంపై సదరు ఎమ్మెల్యేతో కమెండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశమైయ్యారని వార్తలు వచ్చాయి…ఆ సమావేశానికి అధికారులను ఎవరిని అనుమతించలేదని కేవలం అధికార పార్టీ అంతర్గత వ్యవహారమైనందున సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారని తెలుస్తుంది … కొందరు మంత్రులు తమ జిల్లాల పర్యటనలు కూడా రద్దు చేసుకున్నారు ..ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది …స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టానం ఆందోళన చెందుతుందని సమాచారం …

రహస్యంగా భేటీ అయినా ఎమ్మెల్యేలు భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది ..పది మంది ఎమ్మెల్యు ఇలా సమావేశం అవ్వడానికి రెండు రోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని ప్రచారం జరుగుతుంది . తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయం, తమను పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పది మందితో ఫాంహౌస్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది… మరి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో సర్దుబాటు జరిగిందా లేదా అనేది ఆసక్తిగా మారింది…

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో భేటీ అయినట్లు ప్రచారం
జడ్చర్ల ఎమ్మెల్యే విందు ఇచ్చారన్న మల్లు రవి

ఎమ్మెల్యేలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను ఓ హోటల్‌లో విందుకు ఆహ్వానించారని తెలిపారు. ఈ విందు సందర్భంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై చర్చించారని చెప్పారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారంటూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కె. రాజేశ్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో సహా పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.

Related posts

వరాలిచ్చేందుకే తెలంగాణకు సోనియమ్మ… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

మీ మంత్రుల ఫామ్ హౌస్‌లను ముందు కూలగొట్టు…కేటీఆర్

Ram Narayana

ఉపఎన్నికలు వస్తాయి ..స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి ఓటమి ఖాయం: కేసీఆర్

Ram Narayana

Leave a Comment