- భూ భ్రమణాన్ని రికార్డు చేసిన ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్
- హాన్లే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న అంగ్‌చుక్
- 24 గంటల టైమ్ ల్యాప్స్ వీడియోను షేర్ చేసిన వైనం
భూమి తన చుట్టూ తాను తిరగడంతోపాటు సూర్యుడి చుట్టూ తిరుగుతుందనే విషయం మనకు తెలుసు కదా! అయితే, భూమి ఎలా తిరుగుతుందో చూడాలన్న కుతూహలం మనలో చాలామందికి ఉంటుంది. దీనిని గుర్తించిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లడఖ్ లో భూ భ్రమణాన్ని వీడియోలో బంధించారు.
హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న అంగ్‌చుక్ 24 గంటలపాటు టైమ్ ల్యాప్స్ ను ఉపయోగించి భూభ్రమణాన్ని వీడియో తీశారు. ఈ మొత్తాన్ని ఆ తర్వాత ఒక నిమిషం నిడివికి కుదించారు. ఈ వీడియోలో భూమి మాత్రమే తిరుగుతుండగా, నక్షత్రాలు నిశ్చలంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో చిత్రీకరణ కోసం తాను చాలా ఇబ్బందులు పడినట్టు అంగ్‌చుక్ తెలిపారు. తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ వీడియోను చిత్రీకరించినట్టు చెప్పారు. భూమి దిశగా దూసుకువస్తున్న ఫుట్ బాల్ మైదానం కంటే పెద్ద ఆస్టరాయిడ్.. నాసా ఏం చెబుతోందంటే…!
భూమి దిశగా దూసుకువస్తున్న ఫుట్ బాల్ మైదానం కంటే పెద్ద ఆస్టరాయిడ్..

- భూమి వైపుకు దూసుకువస్తున్న 130 – 300 అడుగుల పొడవు గల గ్రహశకలం
- 2024 డిసెంబర్ 27న నాసాకి చెందిన అస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్
- అలర్ట్ సిస్టం ఈ గ్రహ శకలాన్ని గుర్తించిన వైనం
- ఈ గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఒక్క శాతమేనని చెప్పిన నాసా శాస్త్రవేత్తలు
భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలాలు ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఇది 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ (ఐఏసీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భారీ గ్రహశకలం భూమివైపు దూసుకువస్తోందని, దీని పరిమాణం సుమారు ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని తెలిపారు. ఇది భూమి వైపు చాలా వేగంగా వస్తోందని, భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 2032లో భూమిని ఢీకొట్టవచ్చని అంచనా వేశారు.
130 – 300 అడుగుల పొడవు గల ఈ గ్రహశకలం మానవాళి మొత్తానికి తక్కువ ప్రమాదకారి అయినా ఒక పెద్ద నగరాన్ని తీవ్రంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం 8 మెగా టన్నుల టీఎన్‌టీకి సమానమని, ఇది హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కన్నా 500 రెట్లు శక్తివంతమైనది అయి ఉండవచ్చని వారు వెల్లడించారు.
అయితే, 2032 డిసెంబర్ 22న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఒక్క శాతమేనని, అంటే 99 శాతం దాని ప్రభావం భూమిపై ఉండదని వారు తెలిపారు. కాగా, ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న నాసాకు చెందిన ఆస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ కనిపెట్టింది.