కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు …ఖమ్మంలో పాల్గొన్నమంత్రి తుమ్మల
బడ్జెట్ లో తెలంగాణ పట్ల మోడీ సర్కార్ సవతి తల్లి ప్రేమ అని విమర్శ
బడ్జెట్ రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేశారని ధ్వజం
పోలవరం మాదిరి తెలంగాణ లో సాగు నీటి ప్రాజెక్ట్ కు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపాటు
సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లకు నిధుల కేటాయింపులేదు ..
బీజేపీ పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చారు..
సీఎం రేవంత్ ఢిల్లీ లో ప్రధాని కేంద్ర మంత్రులను కలసి విజ్ఞప్తి చేసినా వివక్ష చూపారు.

కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపిందని ఇది అత్యంత దుర్మార్గమని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు …బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు లేపోవడంపై ఆయన కేంద్రంపై మండిపడ్డారు …ఇది రాష్ట్ర ప్రయెజనాల కోసం కేటాయించిన బడ్జెట్ లా లేదని కేవలం రాజకీయాలకు మాత్రమే పెద్ద పీట వేశారని విమర్శకు గుప్పించారు …పీసీసీ పిలుపు మేరకు సోమవారం ఖమ్మంలోని అంబెడ్కర్ సెంటర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానంపై మండిపడ్డారు …పోలవరం మాదిరిగా రాష్ట్రంలో ప్రాజక్టు లకు నిధులు లేవని ,విమానాశ్రయాలకు సర్వేలు తప్ప నిధులు లేవని ,బయ్యారంలో ఉక్కు గాని ఉన్న ఫ్యాక్టరీ లేదని ధ్వజమెత్తారు ..అదే బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు వరద పారించి తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు …సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని ,మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని కేంద్రంపై మంత్రి నిప్పులు చెరిగారు …
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్టానికి చేసిన అన్యాయం పట్ల పార్టీ పిలుపు తో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వనైనది. అనంతరం
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెవలప్మెంట్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయింపులో ఈ రకమైన వివక్ష చూపించడం సరైనది కాదని, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వారి అధికారాల్లో అనుయయా రాష్ట్రాలకు ఏ విధంగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలకు వరాలు కురిపించి అదే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రామైన తెలంగాణకు తీవ్ర అన్యాయాన్ని మిగిల్చి ఈ రకమైన వివక్ష చూపించటం తగదని కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నుంచి పన్నుల ద్వారా డబ్బులు చెల్లిస్తూ ఉంటే కనీసం కట్టిన పన్నులలో సగం కూడా రాష్ట్రానికి కేటాయించకపోవడం ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు, ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి వర్గం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని నిధులు కేటాయించాలని అడిగినా కానీ కనీసం రావలసిన నిధులు కూడా కేటాయించకపోవడం తెలంగాణ రాష్ట్రంపై చూపిస్తున్న వివక్షకు ఇదే నిదర్శనమని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి సాక్షిగా వారి విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర పక్షాన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి వినతి పత్రం అందించి మా నిరసనను తెలియజేస్తున్నాం ఇకనైనా మీ అలసత్వాన్ని వీడి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావలసిన నిధులను కేటాయించాలని లేని పక్షాన తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటి మేయర్ ఫాతిమా జోహార, ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వహక అద్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, వడ్డే నారాయణరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాదు రమేష్ రెడ్డి,జిల్లా మహిళా, సేవాదళ్, మైనారిటీ అద్యక్షులు దొబ్బల సౌజన్య, తదితరులు పాల్గొన్నారు …