- మూడ్రోజులుగా బెదిరింపు కాల్స్
- తనిఖీలు నిర్వహించి బాంబు లేదని గుర్తించిన పోలీసులు
- నిందితుడిని అదుపులోకి పోలీసులు
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మూడు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించగా ఎక్కడా బాంబు లేదని తేల్చారు. ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బెదిరింపు ఫోన్ కాల్స్ ఎందుకు చేశాడనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని సయ్యద్ మీర్ మొహమూద్ అలీ (22)గా గుర్తించారు. ఎస్పీఎఫ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.