Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఐపీఎల్ క్రికెట్

ఐపీఎల్-2025 షెడ్యూల్ విడుదల… లీగ్ ఎప్పట్నుంచి అంటే…!

  • మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్
  • తొలి మ్యాచ్ లో ఆర్సీబీ × కేకేఆర్
  • షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

ఈ వేసవిలో మాంచి క్రికెట్ విందు అందించేందుకు ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) నయా సీజన్ వస్తోంది. ఐపీఎల్-2025 షెడ్యూల్ ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. 

ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, ఈ మెగా టోర్నీ ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్2025లో మే 18తో లీగ్ దశ ముగియనుండగా…. మే 20న క్వాలిఫయర్-1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్, మే 23న క్వాలిఫయర్-2, మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.

Related posts

2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ప్లేయ‌ర్లు వీరే!

Ram Narayana

ఐపీఎల్‌ 2025 మెగా వేలం.. అమ్ముడైన, అన్‌సోల్డ్‌ ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!

Ram Narayana

ఐపీఎల్‌లో అసలైన మజా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం!

Ram Narayana

Leave a Comment