తెలంగాణ వార్తలు

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని బీజేపీ హామీ ఇవ్వలేదు ..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని బీజేపీ ఎప్పుడు చెప్పలేదని ఎక్కడ హామీ ఇవ్వలేదని కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి కిషన్ రెడ్డి అన్నారు …ఆదివారం ఆ ప్రాంతంలో పర్యటించిన మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ అనేది సాధ్యకాదని తేల్చి చెప్పారు …నిపుణులు కూడా ఇదే విషయం చెప్పారని తెలిపారు..ఇక్కడ లభిస్తున్న ఇనప ఖనిజం నాణ్యమైంది కాదని తేలిందన్నారు …బీజేపీ ఏ ఎన్నికల్లోనూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు…విభజన హామీల్లో ఉన్న మాట వాస్తవమేనని కేంద్రమంత్రి అంగీకరించారు …అయితే హామీల్లో ఉన్నదని ఫ్యాక్టరీ పెట్టి నష్టాలు మూటకట్టుకోలేము కదా అన్నారు …మోడీ ఇంట్లో డబ్బులు కాదు …ప్రజల ధనం సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే ఈ నిర్దారణకు వచ్చినట్లు చెప్పారు …ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పర్యటించారు …

Related posts

అమెరికాలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి…

Ram Narayana

వీఆర్ఏలతో చర్చల కోసం కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం

Drukpadam

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్, నాగరాజు

Ram Narayana