Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ … భగ్గుమన్న మటన్ ,చేపల ధరలు …

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. ఆదివారం వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు

  • వారం రోజులుగా ఇదే పరిస్థితి అంటూ వ్యాపారుల ఆవేదన
  • అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గని వైనం
  • మటన్, చేపలకు పెరిగిన డిమాండ్

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ వ్యాపారం భారీగా పడిపోగా …మటన్ , ఫిష్ అమ్మకాలు భారీగా పెరిగాయి…పెరగడమే కాదు ధరలు కూడా భగ్గుమన్నాయి…మాములుగా మటన్ కిలో 800 రూపాయలు అమ్ముతుండగా , అది కాస్త 1000 రూపాయల నుంచి 11 వందలకు చేరుకుంది …ఇందులో కూడా హెడ్,బోన్స్, మెత్తటి మాంసం , బోటి ,బ్లడ్ లాంటి వాటికీ వేరు వేరు రేట్లు ఉంటాయి…ఇక ఫిష్ లో కర్రమీను కు భారీ డిమాండ్ ఏర్పడింది …మాములుగా 4 వందల రూపాలు ఉండే రేటు కాస్త 600 నుంచి 650 కి చేరింది …చిన్న చేపలు , బొచ్చలు , రవ్వలు , గ్యాస్ కట్ , బురద మట్టాలు చిన్న చేపలు ,జెల్లలు, పాము చేపలు , లాంటి వాటికీ వేరు వేరు రేట్లు పలికాయి…వ్యాపారులు డిమాండ్ ను బట్టి రేటు ఫిక్స్ చేసి అమ్మకాలు కొనసాగించారు ..ఇక
ఆదివారం రోజున కిటకిటలాడే చికన్ దుకాణాలు వెలవెల బోయాయి..అయితే ధరలు మాత్రం తగ్గలేదు …కిలో చికెన్ 220 నుంచి 240 పలికింది …ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రం కిలో చికెన్ 160 రూపాయలకే అమ్మారు …

. ప్రతీ ఆదివారం బిజీబిజీగా గడిపే చికెన్ సెంటర్ వ్యాపారులు ఈ వారం ఖాళీగా కనిపిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినడానికి ధైర్యం చేయడంలేదు. ఆదివారం కావడంతో మటన్, చేపలు కొనుగోలు చేస్తున్నారు.

ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం పెరుగుతున్నా చికెన్ ధరల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. కిందటి వారం కేజీ చికెన్ రూ.220 నుంచి రూ.240 ఉండగా.. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 కి అమ్ముతున్నారు. చికెన్ అమ్మకాలు పడిపోవడం, గిరాకీ పెరగడంతో చేపల వ్యాపారులు రేట్లు పెంచి అమ్ముతున్నారు.

Related posts

రంగరాజన్ పై దాడి హేయం… దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: ఏపీ సీఎం చంద్రబాబు

Ram Narayana

లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపిన షర్మిల…. ఫొటోలు ఇవిగో!

Ram Narayana

ఫెంగల్ తుపాను ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు!

Ram Narayana

Leave a Comment