Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

42 మంది కార్మికులను చిదిమేసిన బంగారు గని…

  • ఆఫ్రికా దేశం మాలిలో దుర్ఘటన
  • ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు
  • తప్పించుకునేలోపే మృత్యువాత పడిన కార్మికులు

ఓ బంగారు గని కుప్పకూలిన ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మాలి దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ గని కొందరు చైనా జాతీయులు నిర్వహణలో ఉంది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. 

కొన్ని రోజుల వ్యవధిలోనే మాలి దేశంలో జరిగిన రెండో ప్రమాదం ఇది. గత నెల 29న కౌలికోరో ప్రాంతంలో ఉన్న ఓ బంగారు గని కూలిపోయిన ఘటనలోనూ ప్రాణనష్టం జరిగింది. 

మాలి దేశం ఆఫ్రికాలోని మూడో అతి పెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. ఇక్కడి జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది గనులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. గతేడాది కూడా మాలిలో ఓ బంగారు గని కుప్పకూలి 70 మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడి గనుల్లో చాలా వరకు అనుమతులు లేనివే ఉంటాయని తెలుస్తోంది.

Related posts

ఉద్యోగాల పేరుతో మోసం.. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులు…

Ram Narayana

మీడియా ముందు ట్రంప్-జెలన్ స్కీ వాగ్వివాదం.. ఉక్రెయిన్ బృందాన్ని బయటకు పొమ్మన్న వైట్‌హౌస్!

Ram Narayana

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌ వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్ మృతి..!

Ram Narayana

Leave a Comment