జాతీయ వార్తలు

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్

  • మహిళల్లో క్యాన్సర్ నివారణ కోసం టీకా
  • ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తోందన్న కేంద్రమంత్రి
  • ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు బాలికలు అర్హులని వెల్లడి 
  • టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని వివరణ

మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. అయితే, ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. ముప్పై ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. వ్యాధిని గుర్తించేందుకు డే-కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కస్టమ్స్ డ్యుటీని రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.

Related posts

దోహాలో ఉద్యోగం వచ్చిన గంటల్లోనే భారత యువ ఇంజినీర్ మృతి!

Ram Narayana

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలి: స్టాలిన్

Ram Narayana

అలా అయితే వంటింటి ఆయుధాలతో సిద్ధంగా ఉండండి: మహిళలకు మమతా బెనర్జీ పిలుపు

Ram Narayana