హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ కు గుండెపోటుతో మృతి
అన్ని కేసులు వాయిదా వేసిన న్యాయమూర్తులు
బార్ అస్సోసియేషన్ తీవ్ర సంతాపం
తెలంగాణ హైకోర్టు లో ఒక కేసును సంబంధించి వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ వేణుగోపాల్ ఒక్క సరిగా కుప్పకూలి పోయాడు …వాదనలు వింటున్న న్యాయమూర్తి తోపాటు న్యాయవాదులు ఇతర సిబ్బంది నిర్ఘాంత పోయారు …హుటాహుటిన ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు …మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు …న్యాయవాది మృతితో చీఫ్ జస్టిస్ తో సహా ఇతర న్యాయమూర్తులు , న్యాయవాదులు అన్ని కేసులను తాత్కాలికంగా వాయిదా వేశారు …అన్ని కేసులను రేపు విచారిస్తామని హైకోర్టు రిజిస్ట్రీ ఒక ప్రకటలో తెలిపింది .. వేణుగోపాల్ మృత దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు …బుధవారం అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తుంది …
Save or share this story as a newspaper-style Epaper Clip: