Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఓ బండి నెంబర్ ప్లేటు చూసి విస్తుపోయిన విజయవాడ ట్రాఫిక్ పోలీసులు!


విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఓ బండిని, దానికున్న నెంబరు ప్లేటును చూసి విస్మయానికి గురయ్యారు. ఆ బండి నెంబరు ప్లేటుపై నెంబరుకు బదులుగా మాఫియా అని రాసి ఉంది. బెజవాడలోని ఓ సర్కిల్ వద్ద ట్రిపుల్ రైడింగ్ ను గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆ బండిని ఆపారు. నెంబరు కోసం చూడగా, మాఫియా అని రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి. 

ఈ నెంబరు ప్లేటు ఏంది తమ్ముడూ… ఇన్సూర్డ్ బై మాఫియా అని రాసి ఉందేంట్రా. ఇదేం నెంబరు ప్లేటురా…. నేనెప్పుడూ చూడలేదు… కొత్తగా ఉంది ట్రాఫిక్ పోలీసు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మాఫియా ఏందిరా… ఏ మాఫియారా మీరు… అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, బైక్ సైలెన్సర్ ను కూడా మోడిఫై చేసి ఉండడం గుర్తించారు. 

కాగా, ఆ బైక్ ను ఇటీవలే వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానని, అయితే నెంబరు ప్లేటును మార్చకుండా అలాగే ఉంచానని సదరు బైకర్ వెల్లడించాడు. దాంతో, ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడు ఆ కుర్రాడ్ని ఇంటికి పంపించి నెంబరు ప్లేటు తెప్పించి, అక్కడే రోడ్డుపైనే బండికి బిగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Related posts

మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ పర్యాటకులకు ద్వారాలు తెరుస్తున్న చైనా!

Drukpadam

మారిన ఖమ్మం రూపు రేఖలు …అభివృద్ధి పై మంత్రి పువ్వాడ ఫోకస్!

Drukpadam

ఉత్కంఠ‌కు తెర‌.. గెల్లు శ్రీనివాస్ టీఆర్ యస్ అభ్యర్థి ప్రకటించిన సీఎం కేసీఆర్!

Drukpadam

Leave a Comment