Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ వార్తలు ...

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

  • ఎన్నికల ప్రచారానికి సంబంధించి మూడు పోలీస్ స్టేషన్‌లలో రేవంత్ రెడ్డిపై కేసులు
  • ఈ కేసుల విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారన్న న్యాయవాది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయనపై మూడు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్, బేగంబజార్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు.

Related posts

ఆశారాం బాపుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు!

Ram Narayana

వ‌ల్ల‌భ‌నేని వంశీకి 14 రోజుల రిమాండ్‌.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

Ram Narayana

అత్యాచార బాధితులకు ఏ హాస్పిటలైనా ఉచితంగా చికిత్స అందించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

Ram Narayana

Leave a Comment