తెలంగాణ వార్తలు

తెలంగాణలో రంజాన్ లో 24 గంటలూ దుకాణాలు నడుపుకోవడానికి అనుమతి!

  • రంజాన్ సందర్భంగా కార్మిక శాఖ ఉత్తర్వులు
  • ఉద్యోగులకు నిబంధనల మేరకు వేతనాలు చెల్లించాలని ఆదేశాలు
  • సెలవు రోజుల్లో పని చేస్తే ప్రత్యామ్నాయ సెలవు ఇవ్వాలని సూచన

రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతినిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు నిబంధనల మేరకు వేతనాలు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.

చట్టంలోని నిబంధనల ప్రకారం, రోజుకు ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేసే ఉద్యోగులకు రెండింతల వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఉద్యోగులు సెలవు రోజుల్లో పనిచేస్తే ప్రత్యామ్నాయ సెలవు ఇవ్వాలని ఆదేశించారు. మహిళా ఉద్యోగులు రాత్రి వేళల్లో పని చేసేందుకు జీవో 476ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

Related posts

గవర్నర్ ఆమోదంలో జాప్యం.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

Ram Narayana

కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు… కేసు నమోదు చేసిన ఈడీ

Ram Narayana

అరవింద్ కుమార్ ఆదేశాలతోనే ఎప్ఈఓ కి డబ్బులు బదిలీ…బిఎల్ఎన్ రెడ్డి

Ram Narayana