రఘురామకృష్ణరాజుపై వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన వైసీపీ
వైసీపీ ఎంపీల తరపున ఓం బిర్లాకు లేఖ రాసిన విజయసాయిరెడ్డి
గత ఏడాది జులై 3న ఫిర్యాదు చేశామని లేఖలో పేర్కొన్న విజయసాయి
ఇంతవరకు అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్య
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ నేతలు లేఖ రాశారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశాన్ని వారు మరోసారి లేవనెత్తారు.
రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న తమకు ఫిర్యాదు చేశామని… అయితే అకారణంగా ఈ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ లేఖలో వారు పేర్కొన్నారు. పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.