Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రజాభవన్ లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం!

  • బీసీ నేతలతో సమావేశం కానున్న సీఎం రేవంత్
  • హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు
  • బీసీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొననున్నారు. 

ఈ సమావేశంలో బీసీ నేతలకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణన చేపట్టడం, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందనే సంకేతాలను బలంగా చాటేందుకు ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనుంది. బీసీ నేతల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ భేటీ కీలకంగా నిలుస్తుందని నేతలు భావిస్తున్నారు.

Related posts

పెట్రోలియం డీలర్స్ సమస్యపై కేంద్రమంత్రికి టీఆర్ యస్ ఎంపీ వడ్ఢరాజు వినతి..

Drukpadam

శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతానికి విదేశీ బంగారు వర్ణ రథాన్ని తీసుకొచ్చిన తుపాను!

Drukpadam

అమెరికాకు దన్నుగా కెనడా నిర్ణయం …బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ కు దౌత్య బహిష్కరణ!

Drukpadam

Leave a Comment