Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంత్రి అజయ్ ఉరుకులు పరుగులు ….

మంత్రి అజయ్ ఉరుకులు పరుగులు ….
ఉదయం ఒలంపిక్ రన్ ను ప్రారంభం
ఉదయమే వైరా నియోజవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం
మధ్యాహ్నం ఖమ్మం నియోజకవర్గం లోని రఘునాథపాలెం లో పర్యటన

 

మంత్రి అజయ్ జిల్లాలో ఉరుకులు పరుగులు తాను పెడుతూ అధికార యంత్రాంగాన్ని పెట్టిస్తున్నారు …. కొత్తలో కొంత తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినమంత్రి పరిపాలనపై పట్టు సాధించారు. …. దీనికి తోడు ముఖ్యమంత్రి ,మంత్రి కేటీఆర్ అండదండలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు ….. ఉదయం ఒకచోట ఉంటె మధ్యాహ్నం మరోచోట ,సాయంత్రం మరెక్కడో మారుమూలన ఆయన చేస్తున్న సుడిగాలి పర్యటనలు అధికార యంత్రంగాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి…..

ఖమ్మం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒలింపిక్ రన్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సర్దార్ పటేల్ స్టేడియం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ కర్ణన్, మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ విజయ్ , జిల్లా స్పోర్ట్స్ అధికారి పరందామ రెడ్డి , ఏసీపీలు రామోజీ రమేష్ , ఆంజనేయులు , ఒలింపిక్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామంలో రూ.1.20 కోట్లతోనిర్మించిన 24 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి ప్రారభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండలం విశ్వనాధపల్లి గ్రామంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆగి పలు రోడ్లు, డ్రైన్లు ఆకస్మిక తనిఖీ చేశారు.

గ్రామంలో డబూల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి తొలుత గ్రామంలో పరిశుధ్యాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని నిర్మిస్తున్న వైకుంఠధామం, కంపోస్ట్ షేడ్, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
త్వరితగతిన ఆయా పనులు పూర్తి చేసి వాడుకలోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

 

రఘునాధపాలెం మండలంలో రూ.3.66 కోట్ల రూపాయలతో వివి పాలెం మంచుకొండ R&B రోడ్డు, వేపకుంట్ల నుండి మంచుకొండపంగిడి రోడ్డు మంచుకొండ వరకు. చింతగుర్తి, మల్లెపల్లి మరియు గడ్డికుంట తండ మీదగా బిటి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . తొలుత గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ను మంత్రి ప్రారంభించారు.

రఘునాధపాలెం మండలంలో రూ.3.35 కోట్ల రూపాయలతో
ఖమ్మం౼ఇల్లందు R&B రోడ్డు నుండి వివి పాలెం౼ మంచుకొండ రోడ్డు వేపకుంట్ల వరకు. రఘునాధపాలెం మీదగా బిటి రోడ్డు నిర్మాణ పనులకు వేపకుంట్ల గ్రామం నందు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .

 

 

 

 

Related posts

లైవ్ టీవీలో రష్యాకు వ్యతిరేకంగా మహిళా ఉద్యోగి నిరసన.. 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం..

Drukpadam

టీఆర్ఎస్ ఆందోళ‌న‌ల‌పై తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు…

Drukpadam

తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది… తాజా బులెటిన్ విడుదల!

Drukpadam

Leave a Comment