Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి..

ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పీఏ తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని హైద్రాబాద్ లో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు రద్దుచేసుకొని రాత్రి హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వచ్చి నేరుగా శ్రీనివాస్ రావు భౌతిక కాయాన్ని సందర్శించారు … పూల మాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు … అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుతూ వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

నా ప్రియమైన వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ మన మధ్య నుంచి వెళ్లిపోవడం చాలా బాధాకరం. ఆయన నిబద్ధత, కృషి, మరియు నిస్వార్థ సేవను మర్చిపోవడం అసాధ్యం. ఆయన తన వృత్తిపట్ల చూపిన గౌరవం, నిబద్ధత, మరియు బాధ్యతాయుతమైన వైఖరి అందరికీ స్ఫూర్తిదాయకం.

ఈ విషాద సమయంలో శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి.

భట్టి విక్రమార్క మల్లు .
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి వ్యక్తీగత సహాయకులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఉదయం 9: 30గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు.శ్రీనివాసరావు గారి మృతదేహాన్ని భట్టి విక్రమార్క సతీమణి అమ్మా ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినీ విక్రమార్క పరామర్శించి,మృతదేహానికి ఘన నివాళులర్పించారు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఓదార్చారు. శ్రీనివాసరావు మృతితో తీవ్ర మనస్థాపానికి గురయ్యానన్నారు.

భట్టి పీఏ మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్ధించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

భట్టి పీఏ మృతికి ఎంపీ రఘురాం రెడ్డి సంతాపం

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వ్యక్తిగత సహాయకుడు (పీఏ) శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరుణగిరి సమీపంలోని ఆయన స్వగృహంలో ఉంచిన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్ధించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

తుమ్మల సంతాపం …

ఉపముఖ్యమంత్రి పీఏ శ్రీనివాస్ రావు మరణం తనకు తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు …ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు…

Related posts

అమెరికాలో దుండ‌గుల‌ కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి!

Ram Narayana

వినోబా కాలనీ వాసులకు గృహవసతి కల్పించండి …మాది న్యాయమైన పోరాటం

Ram Narayana

ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు తప్పవు..

Ram Narayana

Leave a Comment