Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మేడారం జాతరను జాతీయ జాతరగా గుర్తించండి :కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ తెలంగాణ మంత్రుల వినతి
-కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్సీల బృందం
-రామప్ప ఆలయాన్ని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చాలని వినతి
-వేయిస్తంబాల గుడి ఖిల్లా వరంగల్ అభివృద్ధికి సహకరించాలి
-మేడారం జాతరకు నిధులు ఇవ్వాలని కోరిన బృందం

గత కొన్ని సంవత్సరాలుగా మేడారం జాతరను జాతీయ జాతరగా గుర్తించాలని రాష్ట్రప్రభుత్వం కోరుతున్న విషయం విదితమే …. మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రిక కట్టడాల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం కేంద్రం ప్రభుత్వాన్ని కోరింది…. ఈమేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ కవిత ,పలువురు ఎంపీలు , కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లదు సింగ్ జోషిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వారు అనంతరం మీడియా కు తెలిపారు. మంత్రిని తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాలని మంత్రుల బృందం కోరింది . అందుకు ఆయన ఒకే చెప్పారు. ప్రత్యేకించి యాదాద్రి టెంపుల్ కు వస్తానని ఆయన వారికీ తెలిపారు.

ఈ సందర్భంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విశిష్టత గురించి మంత్రికి వివరించారు. తెలంగాణ , ఆంధ్రా , ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , కర్ణాటక తదితర నాలుగైదు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మండి ఈ వన జాతరకు వస్తారని ,అందులో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. గిరిజన పూజారులే ఈ జాతర నిర్వహిస్తారని మంత్రుల బృందం తెలిపిన విషయాలను కేంద్రమంత్రి ఆశక్తిగా విన్నారు అందువల్ల దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలని వారు కోరారు .

ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా చారిత్రక సంపదను చాటే రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందజేసింది. అలాగే, రెండేళ్ల కోసారి జరిగే మేడారం జాతరకు ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు. వరంగల్ లోని వేయిస్తంబాల గుడి , ఖిల్లా వరంగల్ అభివృద్ధికి సహకరించాలని మంత్రుల బృద్దాం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ పర్యటనలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత తో పాటు ఎంపీ లు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు .

Related posts

అత్యంత ఘనంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం…

Drukpadam

నిండు కుండా నందికొండ ….నీటి విడుదలకు కేసీఆర్ ఆదేశం!

Drukpadam

అగ్నిపథ్ పై మావాదనలు వినండి …సుప్రీం కు కేంద్రం వినతి …

Drukpadam

Leave a Comment