Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి గంటకు పైగా భేటీ …

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో గంట పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అంశాలనే చర్చించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమతించాలని ప్రధానంగా కోరినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఫేజ్‌-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన అయిదు కారిడార్లను ప్రతిపాదించామని ఇంకా కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు.
రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరిస్తామన్నారు. ఆర్ఆర్ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని దీన్ని మంజూరు చేస్తే.. కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. పోర్టులు లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. అలాగే మూసి పునరుజ్జీవనానికి సహకరించాలని బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్‌, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం కావాలన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి వెంట సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మోదీ గంట పాటు సమయం ఇవ్వడం కష్టం. అయితే రేవంత్ రెడ్డికి మాత్రం గంటకు పైగా సమయం ఇచ్చి వినతులన్నీ విన్నారు..

ప్రతినెల 22 వేల కోట్లు అవసరం..

ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. వస్తున్న ఆదాయం గురించి వివరించారు. 22,500 కోట్లకు గానూ ప్రతీ నెలకు ప్రస్తుతం ఆదాయం 18,500 కోట్లు మాత్రమే వస్తోంది. ఉద్యోగుల వేతనాలకు 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. వడ్డీలకు 6,800 కోట్లు కడుతున్నాం. మిగతా డబ్బును ప్రాజెక్టులు, ఇతర వాటి కోసం ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రం ఆదాయం ప్రతినెల 22 వేల కోట్లకు పెరిగే విధంగా కృషి చేస్తున్నాం. ఆర్థికపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ పథకాల అమలును నిలిపివేయడం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల వడ్డీలకు దాదాపు 6,800 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇది భారంగా ఉన్నప్పటికీ.. ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తున్నాం.. ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయడం లేదు. అందువల్లే ప్రభుత్వపరంగా పథకాల అమలు వేగంగా జరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థికంగా అద్భుత ప్రగతి సాధిస్తోంది. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు కనుక పూర్తయితే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts

పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు..

Drukpadam

వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర: సునీత

Drukpadam

కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన పాకిస్థాన్!

Drukpadam

Leave a Comment