ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌!

  • ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నిక‌లు 
  • ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసిన‌ చంద్ర‌బాబు, లోకేశ్
  • ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం బ‌రిలోకి మొత్తం 25 మంది అభ్య‌ర్థులు

ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఈరోజు ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉండ‌వ‌ల్లిలోని మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లోని పోలింగ్ కేంద్రంలో చంద్ర‌బాబు, లోకేశ్ త‌మ ఓటు వేశారు. ఇక ఈ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. అయితే, వీరిలో కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు (పీడీఎఫ్‌), ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ (కూట‌మి) మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెలకొంది.   

Related posts

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైళ్ల టికెట్ ధరల ఖరారు..!

Drukpadam

కేసీఆర్ రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్

Drukpadam

నా దగ్గర అంత డబ్బుంటే నిన్నే కొనేస్తా: పవన్ కల్యాణ్ కు ద్వారంపూడి కౌంటర్

Drukpadam