Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

యూట్యూబ్ లోని వీడియోలు అన్నీ చూడడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా?

  • నిమిషానికి 500 గంటల కంటెంట్ అందుబాటులోకి..
  • యూట్యూబ్ లో తొలి వీడియో ‘మీ ఎట్ ది జూ’
  • 130 దేశాల్లో 80 భాషల్లో యూట్యూబ్ వీడియోలు

వంటింటి నుంచి అంతరిక్షం వరకు యూట్యూబ్ లో లేని కంటెంట్ లేదు.. వీడియోల రూపంలో ఏ సమాచారం కావాలన్నా యూట్యూబ్ లో వెతకడం మామూలే. అయితే, య్యూట్యూబ్ లో ఉన్న వీడియోలు అన్నింటినీ వరుసగా చూస్తూపోతే ఎంతకాలం పడుతుందో తెలుసా..? ఏకంగా 18 వేల సంవత్సరాలు పడుతుందట. ఆ స్థాయిలో య్యూట్యూబ్ లో కంటెంట్ ఉందని నిపుణులు చెబుతున్నారు. క్షణక్షణానికి అప్ లోడ్ అయ్యే కంటెంట్ ను కూడా చూడాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుంచి ప్రతీ నిమిషానికి ఏకంగా 500 గంటల కంటెంట్ య్యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతోందట.

ఈ లెక్కన ఓ వీడియో చూసేలోపే మరో నెల రోజులకు సరిపడా వీడియోలు య్యూట్యూబ్ లో చేరుతూ ఉంటాయి. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఉన్న ఛానళ్ల సంఖ్య దాదాపు 12 కోట్లు. రోజురోజుకూ కొత్త ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక, సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన షార్ట్స్ గురించి చెప్పనక్కర్లేదు. 15 సెకన్లు మాత్రమే ఉండే ఈ షార్ట్స్ లను య్యూట్యూబ్ తొలుత భారత్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. సక్సెస్ కావడంతో ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది.

అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే య్యూట్యూబ్ ప్రపంచంలోని 130 దేశాల్లో 80 భాషల్లో విస్తరించింది. ఉత్తర కొరియా, చైనా, తుర్కియే, మొరాకో, సౌత్‌సుడాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్‌ తదితర దేశాల్లో య్యూట్యూబ్ పై నిషేధం అమలవుతోంది. య్యూట్యూబ్ లో మొట్టమొదట అప్ లోడ్ చేసిన వీడియో ‘మీ ఎట్‌ ది జూ’.. య్యూట్యూబ్ రూపకర్తలలో ఒకరైన జావేద్‌ కరీమ్‌ షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకూ 35 కోట్ల మంది చూశారు. ఇక య్యూట్యూబ్ లో అత్యధికమంది చూసిన వీడియో ‘బేబీ షార్క్‌ డూడూ… డూడూ’. పిల్లలు పాడుకునే ఓ రైమ్‌కి సంబంధించిన ఈ వీడియోను అక్షరాలా 1500 కోట్ల మంది చూశారట.

Related posts

పగలూ, రాత్రి తేడా లేదు.. ఇక్కడ 24 గంటలూ సూర్యుడు కనిపిస్తాడు!

Ram Narayana

అతి అంటే ఇదేనేమో …20 వేల డౌన్ పేమెంట్ తో మోపెడ్ కొనుగోలు …60 వేలు పెట్టి డీజే తో ఊరేగింపు!

Ram Narayana

ఈ నది పొడవు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Ram Narayana

Leave a Comment