- ట్రెజరీ బెంచ్ కు ముందు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు
- ఆ తర్వాత చీఫ్ విప్, విప్ లకు సీట్లు
- ప్రతిపక్ష బెంచ్ లో ముందు వరుసలో జగన్ సీటు
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శాసనసభలో ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్ కు ముందు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు.
వీరి తర్వాత చీఫ్ విప్, విప్ లకు… ఆ తర్వాత సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నెంబర్ సీట్ ను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు 39వ నెంబర్ సీటును కేటాయించినట్టు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్ కు ప్రతిపక్ష బెంచ్ లో ముందు వరుస సీట్ ను కేటాయించారు.