Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా ?

బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా ?
-బీజేపీ చక్ర బంధనం లో చిక్కుకుంటారా ?
కాంగ్రెస్, వామపక్షాల పొత్తు ఎంతవరకు లాభం
మరి కొద్దీ నెలల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. దేశం మొత్తం బెంగాల్ వైపు చూస్తుంది . అక్కడ జరుగుతున్నా రాజకీయ పరిణామాలతో ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారు ? అనేది చర్చ నీయాశంగా ఉంది . బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా ? లేక బీజేపీ చక్ర బంధనం లో చిక్కుకుంటారా ?కాంగ్రెస్, వామపక్షాల పొత్తు ఎంతవరకు లభిస్తుంది . అనేది ఆశక్తి కరంగా మారింది .
దీదీ దేశంలో మార్మోగుతున్న పేరు. అసలు పేరు మమతా బెనర్జీ .బెంగాల్ రాజకీయాలలో దూసుకొచ్చిన ఒక కెరటం .అనేక డక్కా మొక్కీలు తిన్న ఆడపులి . సింపుల్ సిటీకి మారుపేరు….. నేత తెల్లటిచీర , .. ….. కాళ్లకు స్లిప్పర్లు ,ముఖ్యమంత్రి అయినప్పటికీ పాత ఇల్లు ఆమె నివాసంగా ఉంది . వర్షం వస్తే ఆమె ఇంటికి వెళ్లాలంటే నీటిలో నుంచి నడుచుకుంటే వెళ్లాల్సిందేనని చెబుతుంటారు. ఆరాష్ట్ర ముఖ్యమంత్రిగా టీఎంసీ అధ్యక్షురాలుగా మమతా బెనర్జీ ఉన్నారు . …. పది సంవత్సరాలుగా ఆమె బెంగాల్ ను పరిపాలిస్తున్నారు. కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆమెపై కత్తి కట్టింది . ఆమె పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను , కొందరు ఎంపీ లను మంత్రులను సైతం బీజేపీ తన పార్టీలో చేర్చుకున్నది . ఇటీవలనే మమతాకి ముఖ్య అనుచరుడుగాఉన్న మంత్రి సూదెందు అధికారి బీజేపీలో చేరారు . ఆయన నందిగ్రామ్ నుంచి శాసన సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.మూడురోజుల క్రితం నందిగ్రామ్ లో సభ పెట్టిన దీదీ ఈసారి ఎన్నికలలో తాను నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకించారు .అక్కడ ఉన్న టీఎంసీ కార్యకర్తలు ఆమె ప్రకటనతో హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ విధానాలు పార్టీలు మార్పుల పై బెంగాల్లో చర్చలు జరుగుతున్నాయి . మాటి మాటికీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బెంగాల్ ను సందర్శించి మమతా ప్రభుత్వం పై విమర్శలు గుప్పింస్తుంటారు . ప్రధాని మోడీ , బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా , ఇతర కేంద్ర మంత్రులు తరచూ బెంగాల్ పర్యటనలు చేస్తూ దీదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అస్థిర పరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి . బీజేపీ లాంటి పెద్ద జాతీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి పై అందునా మహిళా ముఖ్యమంత్రి పై ముప్పేట దాడి చేయటం ఆమె కూడా వారిని ఎదుర్కొనేందుకు చూపుతున్న తెగువ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి. గురిచేస్తున్నది. …. అన్నిటిని ఎదుర్కొని ఆమె సింహం ల పోరాడుతున్నారు . ఆమె విధానాలు మంచివా,చెడ్డవా? అనేవి పక్కన పెడితే ఆమె పోరాట పటిమను మెచ్చుకోవాల్సిందే . గతంలో కాంగ్రెస్ తోనూ , తరువాత వామపక్షాలతో , ఇప్పుడు బీజేపీ తో ఆమె చేస్తున్న పోరాటం అమోఘం . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆమెను అష్ట దిగ్బంధనం చేసింది . కేంద్రం నుంచి వచ్చే సహాయం చేయక పోగా , అనేక ఆటంకాలు కల్పించింది . ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టె చర్యలు అనేకం. ఆయినా ఆమె తట్టుకొని నిలబడుతుంది , పోరాటం కొనసాగిస్తుంది . ఆమెకు దేశంలో కూడా పెద్దగా మిత్రులు ఎవరు లేరు. గతంలో కొంత సపోర్ట్ చేసిన చంద్రబాబు బీజేపీ దెబ్బకు మౌనంగా ఉంటున్నారు . తృతీయ ప్రత్యామ్నాయ అన్నకేసీఆర్ పత్తాలేడు . తనకు ఎవరు మద్దతు లేక పోయిన బీజేపీకి సరెండర్ కాకుండ ఆమె చేస్తున్న పోరాటానికి ప్రత్యర్థులు సైతం నివ్వర పోతున్నారు .రానున్న ఎన్నికలలో సైతం ఆమెది ఒంటరి పోరాటమే . కాంగ్రెస్,వామపక్షాలు కలిసి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. బీజేపీ , కాంగ్రెస్ , వామపక్షాలు మమతానే టార్గెట్ చేస్తున్నాయి .దీంతో బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి . చూడాలి మమతా హ్యాట్రిక్ కొడతారా ? లేక బీజేపీ బోణీకొడుతుందా ? అనేది తెలవాలంటే ఎన్నికలవరకు వేచిచూడాల్సిందే ?

Related posts

ఈటలపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు…

Drukpadam

రేవంత్‌కు వ్యతిరేకంగా కీల‌క నేత‌ల భేటీ?

Drukpadam

ఇంటర్నెట్‌ను నిలిపేసే ఒకే ఒక్క ప్రజాస్వామ్య దేశం మనదే.. శశిథరూర్ ఫైర్

Drukpadam

Leave a Comment