అంతర్జాతీయం

జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా క్షిపణి దాడి…

  • క్రీవి రీహ్ లో జన్మించిన జెలెన్ స్కీ
  • క్రీవి రీహ్ లోని ఓ హోటల్ పై రష్యా క్షిపణి దాడి
  • నలుగురు మృతి… 30 మందికి గాయాలు

ఓవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వస్థలంపై క్షిపణి దాడి జరిగింది. క్రీవి రీహ్ లో జెలెన్ స్కీ జన్మించారు. క్రీవి రీహ్ లోని ఓ హోటల్ పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందారు. మరో 30 మంది గాయపడగా… వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుగా ఉంది. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేశారు. ఈ తరుణంలో జెలెన్స్ స్కీ స్వస్థలంపై క్షిపణి దాడి జరగడం గమనార్హం.

Related posts

సంప్రదాయం ప్రకారం అర్ధరాత్రి ఓటేసిన ఆరుగురు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ షురూ…

Ram Narayana

అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి…

Ram Narayana

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులోకి మరో ఇండియన్ అమెరికన్

Ram Narayana