జాతీయ వార్తలు

మహిళకు ఒక హత్య చేసే అవకాశం కల్పించాలన్న ఎన్సీపీ మహిళా నేత ఖడ్సే

మహిళలపై హత్యలు , అత్యాచారాలు , వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి…దేశం అభివృద్ధి చెందుతుందని పాలకులు చెపుతున్నప్పటికీ మహిళలపై జరుగుతున్నా అఘాయిత్యాలు , అకృత్యాలు అరికట్టడంలో విఫలం అవుతున్నాం …ప్రపంచదేశాల్లో మానస్థానం చేసుకుంటే అట్టడుగున ఉన్నది … ప్రపంచంలో 146 దేశాలకు సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ తీసుకుంటే మహిళకు రక్షణ విషయంలో మనదేశం 127 స్థానంలో ఉండటం సిగ్గుచేటు ..అనేక చట్టాలు తెచ్చామని పాలకులు గొప్పలు చెప్పుకున్న వాటి అమలుకు తగిన యంత్రాంగం లేకపోవడం ,కేసులు ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉండటం కారణాలుగా ఉన్నాయి…దిశా , అభయ లాంటి చట్టాలు , లేదా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు వచ్చిన నేరాలు తగ్గడంలేదు ..దీంతోనే విసుగు చెందిన రోహిణి ఖడ్సే తమకు ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసే అవకాశం ఇవ్వండిని రాష్ట్రపతిని కోరారు..కోరడమే కాదు నేరుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే …”స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం.. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి.. ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం ఇవ్వండి” అంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన రోహిణి ఖడ్సే…మహిళలపై పెరుగుతున్న నేరాల అణచివేతకు, ఒకవేళ నేరం జరుగుతున్నప్పుడు మహిళలు చేసే హత్యకు ఎలాంటి శిక్ష పడకుండా రక్షణ కల్పించాలని ఆమె లేఖ రాశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రోహిణి, మహాత్మా గాంధీ, బుద్ధుడు నడయాడిన నేలలో, శాంతికి, అహింసకు నిలయమైన నేలలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింసా ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం ముంబైలో పన్నెండేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమె పరిస్థితి గురించి ఆలోచించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మానవ మృగాల్లోని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనా విధానాన్ని అంతమొందించేందుకు తమకు అవకాశమివ్వాలని ఆమె కోరారు. దేశ రక్షణ కోసం మహారాణి తారా రాణి, అహల్యాదేవి హోల్కర్ వంటి వారు కత్తిని బయటకు తీశారని గుర్తు చేశారు.

ఇటీవల విడుదలైన సర్వే ప్రకారం దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తేలినట్లు చెప్పారు. మహిళల కిడ్నాప్‌లు, అదృశ్యం, గృహ హింస వంటి నేరాలతో ఆసియాలోనే మన దేశం అసురక్షితంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము చేసే ఒక్క తప్పును క్షమించాలని మహిళల తరఫున కోరుతున్నట్లు ఆమె విజ్ఞప్తి చేశారు.
అలాంటి అనుమతులు ఇవ్వడం కుదరదనేది ఆమెకు కూడా తెలుసు ..అయితే ఆమె ఆవేదనతో చేసిన విజ్ణప్తిగా అర్ధం చేసుకొని ఇప్పటికైనా మహిళలకు తగిన రక్షణ కల్పించేలా పాలకులు చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

Related posts

అయోధ్య రామమందిరం గర్భ గుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం

Ram Narayana

ఇంటిముందు పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు.. హర్యానాలో ఘోరం…

Ram Narayana

మహారాష్ట్రలో మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రయాణికులను కాపాడిన డ్రైవర్!

Ram Narayana