ఆంధ్రప్రదేశ్

కిష్టారం అంబేద్కర్ నగర్ వాసుల సమస్యలపై రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలి – పొంగులేటి సుధాకర్ రెడ్డి

కిష్టారం అంబేద్కర్ నగర్ వాసుల సమస్యలపై రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలి – పొంగులేటి సుధాకర్ రెడ్డి

కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ వాసులు సింగరేణి డామేజ్డ్ సైలో బంకర్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రామానికి అతి సమీపంలో నిర్మించిన ఈ సైలో బంకర్ నుండి వెలువడే దుమ్ము, ధూళి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ సమస్యపై స్పందించకపోవడం దురదృష్టకరం.

ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా సింగరేణి‌లో నియామకాలు, కాంట్రాక్టలు, నిధుల వినియోగం వంటి అంశాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని కోరారు.

ఈ సమస్యను ఇప్పటికే కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, దృష్టికి తీసుకెళ్లామని, బాధితుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు బీజేపీ వారి వెంట ఉంటుందని త్వరలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని సైతం ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

రేపు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కిష్టారం ప్రజలు తీవ్ర ఆవేదనతో రైలు పట్టాలపై కూర్చుని బొగ్గు రైళ్లను అడ్డుకునే స్థాయికి వెళ్లినా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విడ్డూరమన్నారు. తక్షణమే యుద్ధప్రాతిపదికన పునరావాసం కల్పించి, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related posts

విడాకుల కేసులో ఇజ్రాయెల్ కోర్టు విచిత్రమైన తీర్పు..

Drukpadam

ఎమ్మార్ ప్రాప‌ర్టీస్ కేసులో కోనేరు మ‌ధుకు సుప్రీంకోర్టు నోటీసులు!

Drukpadam

ఆస్తులన్నీ సునీత పేరున బాబాయ్ రాశారు.. ఆస్తుల గొడవే అయితే సునీతను చంపేవాళ్లు: వైఎస్ షర్మిల…

Drukpadam