క్రైమ్ వార్తలు

మంచినీళ్లు కావాలని అడిగి మంగళసూత్రం లాక్కెళ్లాడు…!


హైదరాబాదులో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ మంచినీళ్లు కావాలని అడిగి, మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కెళ్లాడు. కేపీహెచ్ బీ టెంపుల్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఉదయం వేళ ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటోంది. ఇంతలో ఓ వ్యక్తి ఖాళీ బాటిల్ తీసుకుని వచ్చి, మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ వ్యక్తి ముఖానికి మంకీ క్యాప్ ధరించి ఉన్నాడు. మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు ఇంటి లోపలికి వెళ్లగానే, ఆ వ్యక్తి కూడా గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కుని, పరారయ్యాడు. మహిళ అరుచుకుంటూ బయటికి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మంగళసూత్రం రెండున్నర తులాలు ఉంటుందనిభావిస్తున్నారు.

Related posts

ఎంపీ పేరుతోనే బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు…

Ram Narayana

196 దేశాలకు మోస్ట్ వాంటెడ్….. గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహంతో దొరికిపోయాడు!

Drukpadam

పాక్ మసీదులో ఉగ్రదాడి ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య!

Drukpadam