Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్…

  • రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక బిల్లు 2025పై చర్చ
  • ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలకు జీఎస్టీ వర్తించబోదని వెల్లడి
  • ఆన్‌లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీ/డిజిటల్ పన్నును రద్దు చేయనున్నట్లు వెల్లడి

జీఎస్టీ నుండి ఆలయ ప్రసాదాలను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై జరిగిన చర్చలో ఆమె ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలపై జీఎస్టీ వర్తించదని ఆమె స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులలో నెలకొన్న అనిశ్చితిని తొలగించే క్రమంలో
ఆన్‌లైన్ ప్రకటనలపై విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీ/డిజిటల్ పన్నును రద్దు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025కి ప్రతిపాదించిన 59 సవరణల్లో ఇది కూడా ఒకటి.

Related posts

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అందుకోసమేనా …?

Ram Narayana

ఎంపీ వద్దిరాజుకు రాజ్యసభ ఛైర్మన్ శుభాకాంక్షలు

Ram Narayana

50 లక్షల 65 వేల కోట్లతో కేంద్రం భారీ వార్షిక బడ్జెట్!

Ram Narayana

Leave a Comment