- ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాత్రి 11.45 గంటలకు చివరి రైలు ప్రారంభమవుతుందని వెల్లడి
- సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే మారిన వేళలు అమల్లో ఉంటాయని వెల్లడి
- టెర్మినల్ స్టేషన్ నుంచి ఆదివారం మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందన్న ఎండీ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు నడుస్తున్న మెట్రో రైలు సేవలు, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాత్రి 11.45 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మారిన వేళలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
మరోవైపు, 2024 ఏప్రిల్ లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలీడే ఆఫర్ మరియు ఆఫ్ పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ ఆఫర్ ద్వారా 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో, ఈ ఆఫర్‌ను మరో ఏడాది పాటు పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది.