Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం కొందరికి మోదం …కొందరికే ఖేదం…

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం కొందరికి మోదం …కొందరికే ఖేదం
-సీనియర్లు అడ్డుకున్నా … ఆగని రేవంత్ నియామకం
-జంబో కార్యవర్గం అంటున్న పరిశీలకులు
-కాంగ్రెస్ లో ముసలం తప్పదంటున్న విమర్శకులు

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ నియామకం కొందరికి మోదం కాగా ,మరికొందరికి ఖేదంగా మారింది…. కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా ,మరికొందరు షాక్ కు గురైయ్యారు .పార్టీ హైఅకండ్ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక ,సమర్థించలేక సతమతమవుతున్నారు …

నిన్నమొన్నటి వరకు సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని పీసీసీ చీఫ్ గా నియమిస్తారని సీనియర్ నేతలు భావించారు. రేవంత్ నియామకంపై జరిగితే పార్టీలో జరిగే పరిణామాల గురించి తమ తమ అభిప్రాయాలూ వెల్లడించి వచ్చారు. తమ అభిప్రాయాలకు భిన్నంగా హైకమాండ్ రేవంత్ ను టీపీసీసీ చీఫ్ గా నియమించటం జరగదని గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందరికి ఆమోదయోగ్యమైన జీవన్ రెడ్డికి అవకాశం దక్కుతుందని భావించారు . సీనియర్ల అంచనాలను తలకిందులు చేస్తూ పార్టీ హైకమాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వైపే మొగ్గింది.

పీసీసీ పీఠం కోసం చాలామంది ప్రయత్నాలు చేసిన వారందరిని పక్కన పెట్టారు . ప్రధానంగా ముందునుంచి కోమటి రెడ్డి వెంకట రెడ్డి , రేవంత్ రెడ్డి , శ్రీధర్ బాబు , మధుయాష్కీ గౌడ్ , జగ్గారెడ్డి పేర్లు పీసీసీ రేసులో బాగా ప్రచారం లో ఉన్నాయి. ఒక సందర్భంలో భవనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి , రేవంత్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో నడిచింది. పీసీసీ చీఫ్ ఎంపికపై సీనియర్ లకు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది.ఎవరికి వారు ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేశారు. పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పార్టీ లోని అనేకమంది ముఖ్య నేతల అభిప్రాయాలూ తీసుకున్నారు . రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను , కాంగ్రెస్ కు పూర్వవైభవాన్ని తేవాలంటే ఎవరైతే బాగుంటదని అభిప్రాయసేకరణ చేశారు . వివిధ కోణాల్లో పరిశీలన చేసిన పార్టీ అధిష్టానం చివరికి రేవంత్ రెడ్డి డైనమిజం వైపే ముగ్గుచూపి ఆయనపై నమ్మకం ఉంచింది .

తెలంగాణ సీనియర్లు అందరికి ఆమోదయోగ్యమైన సీనియర్ నేత జీవన రెడ్డి పేరు ప్రతిపాదించారు. వి. హనుమంత రావు, భట్టి , జగ్గా రెడ్డి , శ్రీధర్ బాబు , లాంటి నేతలు రేవంత్ విషయంలో తమ అభిప్రాయాలను ఏఐసీసీ పెద్దలకు వివరించారు. కొంతమంది బెదిరింపులను , అభ్యంతరాలను తోసిపుచ్చి రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సంతకంతో ప్రకటన విడుదల చేసింది.

జంబో కార్యవర్గం

ఏఐసీసీ ప్రకటించిన తెలంగాణ పీసీసీ కార్యవర్గం చాంతాడంత ఉండటంతో జంబో కార్యవర్గం అనే విమర్శలు ఉన్నాయి. ఐదుగురు వర్కింగ్ ప్రసిడెంట్లు , 10 మంది ఉపాధ్యక్షులు తో కార్యదర్శలు ప్రధాన కార్యదర్శలు ,కార్యదర్శులు , కార్యవర్గ సభ్యులు , అనేక మంది ఇందులో ఉన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ని నియమించారు. పార్టీ మరో కమిటీకి దామోదర రాజనరసింహ ను నియమించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , జీవన్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ ,జానారెడ్డి , లాంటి సీనియర్ నేతల సేవలు పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టం కావాల్సివుంది .

కాంగ్రెస్ లో ముసలం తప్పదా

సీనియర్ల అభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి ని నియమించడంపై పార్టీ లో నెలకొన్న సందిగ్దత ఎటు వైపు దారితీస్తుందో అనే సందేహాలు ఉన్నాయి. పార్టీలో ముసలం తప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నడూ లేనిది మరియమ్మ లాక్ డెత్ పై కేసీఆర్ కాంగ్రెస్ శాసనసభ పక్షానికి ప్రగతి భవన్ లో అపాయింట్ మెంట్ ఇవ్వడం పై రాజకీయ పార్టీలను షాక్ కు గురిచేసింది . భట్టి నేతృత్వంలో వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లు చెప్పింది సావధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినడమే కాకుండా విచారణకు ఆదేశించడం,మరియమ్మ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ,కుమారుడికి ఉద్యోగం లాంటి పరిణామాలు రాజకీయవర్గాలలో ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. కారణాలు ఏమైనా మరియమ్మ కుటుంబానికి న్యాయం జరగటంపై సానుకూలత వ్యక్తం అవుతుంది.

Related posts

వాస్తవాలు చెప్పకుంటే ముక్కు నెలకు రాసి మూలాన కూర్చోండి -కోదండరాం హెచ్చరిక

Drukpadam

తీన్మార్ మల్లన్న బీజేపీకి గుడ్ బై …కొత్త పార్టీ దిశగా అడుగులు…

Drukpadam

చంద్రబాబు వేలి ఉంగరంపై జగన్ సైటర్ …

Drukpadam

Leave a Comment