తెలంగాణ రాజకీయ వార్తలు ..

హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల బీజేపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా గౌత‌మ్‌రావు!


హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల బీజేపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఎస్‌. గౌత‌మ్‌రావును అధిష్ఠానం ప్ర‌క‌టించింది. బీజేపీ సెంట్ర‌ల్ జిల్లా అధ్య‌క్షుడిగా ఆయ‌న ప‌నిచేశారు. కాగా, మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాక‌ర్ ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. దీంతో హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్‌, ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఈరోజే నామినేషన్లకు చివరి తేదీ కాగా, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖ‌రి గ‌డువు. ఈ మేర‌కు ఇప్ప‌టికే కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది.  

Related posts

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ ఓబీసీ నేత కీలక వ్యాఖ్యలు

Ram Narayana

తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి: తంగళ్లపల్లి ప్రజలతో కేటీఆర్…

Ram Narayana

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్…

Ram Narayana