తెలంగాణ వార్తలు

గ్రూప్-1 నియామకాలు… సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ప్రకటించిన టీజీపీఎస్సీ!

  • నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో గ్రూప్ -1 పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన
  • ఈ నెల 16,17,19,21వ తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 
  • ఎంపికైన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు రావాలని టీజీపీఎస్సీ సూచన

గ్రూప్-1 నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను టీజీపీఎస్‌సీ ప్రకటించింది.

గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని టీజీపీఎస్‌సీ తెలిపింది.

సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 

Related posts

రేవంత్ అంకుల్.. మా ఇల్లు కూల్చేయద్దు ప్లీజ్..

Ram Narayana

కాంగ్రెస్ పెద్దలను కలవకుండానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి

Ram Narayana

కొండా సురేఖ మార్ఫింగ్ ఫొటో ఇష్యూ… రఘునందన్ రావు ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్

Ram Narayana