అంతర్జాతీయం

దుబాయిలో ఇద్ద‌రు తెలుగోళ్లను దారుణంగా హ‌త్య చేసిన పాకిస్థానీ!

  • చంపిన తర్వాత పాకిస్థానీ మతపరమైన నినాదాలు
  • మృతుల్లో ఒకరిది నిర్మల్‌.. మరొకరిది నిజామాబాద్‌ జిల్లా
  • అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు

దుబాయిలో తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రిని ఓ పాకిస్థానీ దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గ‌త శుక్ర‌వారం ఇద్ద‌రు తెలుగోళ్లను పాకిస్థాన్ పౌరుడు అతి కిరాత‌కంగా నరికి చంపాడు. నిర్మ‌ల్ జిల్లా సోన్‌కు చెందిన అష్ట‌పు ప్రేమ్‌సాగ‌ర్ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయిలోని ఓ పేరొందిన బేక‌రీలో ప‌నిచేస్తున్నారు. 

అదే బేక‌రీలో ప‌నిచేసే ఓ పాకిస్థానీ ప‌ని ఒత్తిడి, మ‌త విద్వేషంతో వీరిద్ద‌రిని దారుణంగా న‌రికి చంపాడు. ఈ దాడిలో మ‌రో ఇద్ద‌రు తెలుగువారు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంద‌ని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధం.. మెస్సీ, రొనాల్డో, హామిల్టన్ షెడ్యూల్స్ గందరగోళం…

Ram Narayana

ల్యాండర్, రోవర్ నుంచి అందని సిగ్నల్స్‌.. మరిన్ని రోజులు వేచి చూస్తామన్న ఇస్రో

Ram Narayana

యూరోపియన్ ఆర్మీ ఏర్పాటు ప్రమాదకరం: ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్

Ram Narayana