Smita Sabharwal
తెలంగాణ వార్తలు

స్మితా సభర్వాల్ చేసిన మరో ట్వీట్ వైరల్

తెలంగాణ యువ, ఆధునీకరణ, పర్యాటక, సంస్కృతి శాఖల ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ చేసిన మరో ట్వీట్ ఇప్పుడు వైరలైంది. కంచ గచ్చిబౌలి భూ సమస్యకు సంబంధించి ఆమె మారో వివాదాస్పదమైన ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువులు ఉన్నాయంటూ ఇటీవల ఏఐ ఫొటోతో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ‘హాయ్ హైదారాబాద్’ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫొటోను ట్వీట్ చేయగా, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తొలుత ఈ నోటీసులకు స్పందించని స్మితా సబర్వాల్, ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాజాగా శనివారం ఈ వివాదంపై స్మితా సబర్వాల్ స్పందించారు. గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబిచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ‘హాయ్ హైదరాబాద్’ ట్వీట్ ను తాను రీట్వీట్ చేశానని, తనలాగే మరో 2 వేల మంది కూడా దానిని రీట్వీట్ చేశారని స్మితా సబర్వాల్ గుర్తుచేశారు. తనకు పంపినట్లే మిగతా 2 వేలమందికి కూడా నోటీసులు పంపించారా..? అని నిలదీశారు. వారందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకున్నారా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు.

Related posts

మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఆధ్వరంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ..హెల్త్ కార్డుల కోసం

Ram Narayana

ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana