Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Imter Results, Telangana
తెలంగాణ వార్తలు

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్లో 66.89, సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత

  • ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క  

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌లయ్యాయి. మంగళవారం నాంప‌ల్లిలోని ఇంట‌ర్‌ బోర్డు కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌లు స‌త్తా చాటారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. బాలిక‌లు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్షల‌కు 4,88,430 మంది హాజ‌రు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా, బాలిక‌లు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియ‌ర్ ప‌రీక్షల‌కు 5,08,582 మంది హాజ‌రు కాగా… 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫ‌లితాల కోసం ప్రభుత్వ‌ అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ లో చూడోచ్చు. విద్యార్థులు త‌మ హాల్ టికెట్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి, రిజ‌ల్ట్ చూసుకోవ‌చ్చు. కాగా, మార్చి 5 నుంచి 25 వ‌ర‌కు 1,532 కేంద్రాల్లో ఇంట‌ర్ వార్షిక పరీక్షలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఇంట‌ర్ వార్షిక ప‌రీక్షల‌కు మొత్తం 9.96 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.  

Related posts

కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు… ఉలిక్కిపడ్డ జనం

Ram Narayana

ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు…డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

ప్యాకేజీలపై రేణుకాచౌదరి సెటైర్లు …ఎవరు ఇస్తున్నారంటూ ఎదురు ప్రశ్న…

Drukpadam

Leave a Comment