Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దళితుల ఎంపరర్ మెంట్ పై సీఎం కేసీఆర్ కు ప్రశంసల జల్లు…

దళితుల ఎంపరర్ మెంట్ పై సీఎం కేసీఆర్ కు ప్రశంసల జల్లు
-దళితుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం కేసీఆర్
-దళిత మేధావి వర్గం కలిసిరావాలని విజ్నప్తి
-సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ సదస్సు నిర్వహణ
-సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మేధావులు
-దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న కేసీఆర్
-సూచనలు, సలహాలు ఇవ్వాలని మేధావులకు పిలుపు

దళితుల అభున్నతికోసం సీఎం కేసీఆర్ ఇటీవల జరిపిన అఖిలపక్ష సమావేశం దానిలో జరిగిన చర్చ …. దళితుల కోసం సీఎం తీసుకున్న కార్యాచరణ ప్రణాళిక పై సానుకూలత ఏర్పడింది …. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు…. దీనిపై కేసీఆర్ కు ధాన్యదాలు తెలిపేందుకు మేధావులు ప్రగతి భవన్ లో కలిశారు.

దళితుల అభ్యున్నతే పరమావధిగా సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, దళిత మేధావులు నేడు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమతో కలిసి రావాలంటూ దళిత మేధావి వర్గానికి పిలుపునిచ్చారు. తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పును రాబట్టేందుకు రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. తమ లక్ష్య సాధనలో దళిత మేధావి వర్గం కూడా సహకరించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

తొలుత రూ.1200 కోట్లతో ప్రారంభించి, రాబోయే కాలంలో రూ.40 వేల కోట్లతో అమలు చేయబోతున్న సీఎం దళిత సాధికారత పథకం కోసం పటిష్ఠమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యాచరణకు ఉపయోగపడేలా తగిన సూచనలు, సలహాలు అందించాలని దళిత మేధావులను కోరారు.

ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసిన దళిత మేధావుల్లో ఎస్సీ, ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, మాదిగ విద్యావంతుల వేదిక, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతర దళిత సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రొఫెసర్లు, ఇతర మేధావులు ఉన్నారు.

Related posts

ఆర్థికంగా బలహీన వర్గాల వారికి రూ.8 లక్షల పరిమితే అమలు: సుప్రీంకు కేంద్రం!

Drukpadam

గరిటె పట్టిన పంజాబ్ సీఎం.. ఒలింపిక్ వీరులకు వండి వడ్డించిన ముఖ్యమంత్రి!

Drukpadam

Drukpadam

Leave a Comment