Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆంధ్రా కాంగ్రెస్ సమావేశాలకు …. చిరంజీవి రాడు …కిరణ్ వస్తాడో లేదో తెలియదు…

ఆంధ్రా కాంగ్రెస్ సమావేశాలకు …. చిరంజీవి రాడు …కిరణ్ వస్తాడో లేదో తెలియదు
-మాజీముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన ఉమెన్ చాందీ
-చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారని వెల్లడి
-కిరణ్ కుమార్ వస్తాడో రాడో తెలియదు
– పార్టీ లో ఆశక్తికర పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లో ఆశక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి . పార్టీ సమావేశాలకు అనేకమంది పెద్దలు దూరమైయ్యారు . ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల అనంతరం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి రాజ్యసభ సీటు పొంది ఏకంగా కేంద్రమంత్రి అయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకు ఉన్న చిరంజీవి తర్వాత సినిమాల్లో తిరిగి నటించటం ప్రారంభించారు . అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు . ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారా ? లేరా? అనేది కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమన్ చాందీకి విజయవాడలో మీడియా నుంచి అనూహ్యంగా చిరంజీవి గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడు అయన ముందు నవ్వుతు తడబడి , తరువాత స్పందిస్తూ చిరంజీవి చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సినిమాల్లో నటించటంలో బిజీ అయ్యారని అన్నారు .అంతే కాకుండా పార్టీ లో ఉండగా కూడా ఆయన సమావేశాలకు వచ్చిన సందర్భం లేదని వివరించారు.

అనంతరం హైద్రాబాద్ చేరుకున్న ఉమన్ చాందీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఆయనతో మంతనాలు జరిపారు . ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ను మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడు ఆక్టివ్ అవుతున్నారని ప్రశ్నించగా అన్ని విషయాలు తరువాత మాట్లాడుకుందామని దాటవేశారు .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కనుమరుగు అయింది.రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత , పెద్దగా నష్టపోయిన పార్టీ ఏదైనా ఉంటె అది కాంగ్రెస్ మాత్రమే . ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ అనే కోపం ఉంది . అందువల్ల 2014 ,2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు.

పైగా గతంలో కాంగ్రెస్ లో ఉండి అనేక విధాలుగా లబ్ది పొందిన నాయకులు కావూరి సాంబశివరావు , పురందరేశ్వరి, రాయపాటి సాంబశివరావు , ఉండవల్లి అరుణ్ కుమార్ , లగడపాటి రాజగోపాల్ ,సబ్బం హరి , హర్షకుమార్ ,కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి , జేసీ దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి , కాంగ్రెస్ కు దూరమైయ్యారు .

ప్రజాకర్షణ కలిగిన నాయకుడు కాగ్రెస్ కు కరువైయ్యారు . జగన్ లాంటి ప్రజాకర్షణ కలిగిన బలమైన నాయకుడిని కాగ్రెస్ చేజేతులా పోగుట్టుకున్నది .అనేకమంది ముఖ్యనాయకులు కాగ్రెస్ కు గుడ్ బై చెప్పారు .

కాగ్రెస్ నుంచి అనివార్య పరిస్థితుల్లో బయటకు వచ్చిన జగన్ ప్రత్యేక పార్టీ పెట్టుకుని మొదటిసారి శాసనసభలో బలమైన ప్రతిపక్షముగా , రెండవసారి అత్యంత ఘనవిజయం సాధించి అధికారం చేపట్టారు. కాంగ్రెస్ కు సంప్రదాయంగా ఉన్న ఓటర్లు అందరు జగన్ వైపు షిఫ్ట్ అయ్యారు .

తెలంగాణ రాష్త్రం ఇచ్చిన ఖ్యాతి కాగ్రెస్ కు దక్కలేదు . సరికదా కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా నిలవలేక పోయింది. ఒక వేళ బొటాబొటిగా ప్రతిపక్షంగా ఉండేందుకు సీట్లు వచ్చిన అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లు అధికార టీఆర్ యస్ లో చేరిపోతున్నారు. దీనితో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక పోతుంది…. ఆంధ్రాలో ఆలా తెలంగాణ ఇలా కాంగ్రెస్ రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది …..

Related posts

పొంగులేటి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా…?

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి కనపడటం లేదంటూ పోస్టర్లు…పద్మావతి స్పందన!

Drukpadam

తుమ్మల హంగామా …దేనికి సంకేతం..!

Drukpadam

Leave a Comment