తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో జర్నలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు …మంత్రి పొంగులేటి …

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం
టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి
ఇళ్లస్థలాలు ,హెల్త్ కార్డులపై పై త్వరలో సమావేశం
ఇందిరమ్మ రాజ్యంలో అందరికి న్యాయం చేస్తాం …
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .రాంనారాయణ …

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్ర కమిటి పిలుపుమేరకు జర్నలిస్టులు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్యలపై టియుడబ్ల్యుజె (ఐజెయు) ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు మంగళవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని సర్దార్ పట్టేల్ స్టేడియం హెలిప్యాడ్ వద్ద మంత్రి పొంగులేటికి వినతిపత్రాన్ని అందజేశారు.అక్రడేషన్ల గడువు పూర్తి అయ్యి పది నెలలు పూర్తి అయినప్పటికి ఇంకా కొత్త అక్రిడేషన్ల కార్డులను మంజూరు చేయకపోవడంపై మంత్రి స్పందిస్తూ కొత్తగా అక్రిడేషన్ల జారీపై మార్గదర్శకాలను తయారు చేసేందుకు ఒక కమిటిని ఏర్పాటు చేయగా ఆ కమిటి నివేధిక ను కూడా అందజేసిందని, ఆ నివేదికను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.ఈ నివేధకంపై ఇంకా ఏమైనా ఉంటే అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.జర్నలిస్టుల సంక్షేమం, హెల్త్ కార్డులు,ఇళ్ళ స్ధలాలు ఇతరాత్ర సమస్యలపై త్వరలో జర్నలిస్టు సంఘాలతో కూడా సమావేశం అవుతామన్నారు.ఈ సందర్బంగా టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాంనారాయణ పలు సమస్యలను మంత్రి ద్రష్టికి తీసుకేళ్ళారు.గత 60 సంవత్సరాలలో జర్నలిస్టుల వృత్తి నిర్వహణకు సంబంధించి అనేక కమిటీలను, సంక్షేమ కార్యక్రమాలను సాధించుకుందని అయితే గత పదేళ్ల కాలంలో అవి సరిగ్గా అమలు కాకుండా పోయాయని వీటన్నిటినీ సరిదిద్ది జర్నలిస్టులు, మీడియా సంస్థలు స్వేచ్చగా పనిచేసే వాతావరణం కల్పించవలసిందిగా కోరారు . తెలంగాణ స్టేట్ లెవెల్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ.వేజ్ బోర్డు సిపార్సుల అమలును పర్యవేక్షించే త్రైపాక్షిక కమిటీ.జర్నలిస్టులపై దాడుల నిరోధక హైపవర్ కమిటీ లను అధికారికంగా ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్బంగా విజ్ణప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరిగా *జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ ను సమర్థవంతంగా అమలు చేయాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను కూడా సత్వరమే పరిష్కరించాలని కోరారు.ఖమ్మం నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాలకు సంబంధించి గత ప్రభుత్వం ‘‘ స్ధంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సోసైటి’’కి 23.2 ఎకరాల స్దలాన్ని కేటాయిస్తూ అనాటి మంత్రి వర్గం తీర్మాణం చేసి జీవోలను కూడా వెలువరించాయి.కావున స్దంభాద్రి జర్నలిస్ట్ హౌజింగ్ సోసైటికి కేటాయించిన ప్రభుత్వ స్ధలాన్ని వెంటనే సోసైటికి అప్పగించే విధంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ణప్తి చేయగా దానికి మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించి త్వరలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం గుర్తింపు పొందిన యూనియన్ లతో సమావేశం అవుతామన్నారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె (ఐజెయు)జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,రాష్ట్ర కమిటి సభ్యులు మాటేటి వేణుగోపాల్ రావు,జిల్లా ఉపాధ్యక్షులు మైనోద్దిన్, సీనియర్ జర్నలిస్టు ,ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ నలజాల వెంకట్రావ్, జిల్లా ఎలక్ర్టానిక్ మీడియా అసోసియేన్ ఉపాధ్యక్షులు మామిడాల భూపాల్ రావు, జనార్దనాచారి, పసుపులేటి సత్యనారాయణ, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, ఏలూరు వేణుగోపాలరావు, మేడి రమేశ్, కళ్యాణ్, గోసుల నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దసరా కానుక పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులు క్లియర్ చేస్తున్నాం ..డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కవుల ,కళాకారుల ఐక్య వేదిక ఏర్పాటు …!

Ram Narayana

టీఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గా నిర్మాత‌ దిల్ రాజు!

Ram Narayana