Ganja
తెలంగాణ వార్తలు

24 బ్యాగుల ఓజీ కుష్ గంజాయి పట్టి వేత

శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా ఓజీ కుష్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తుండగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఓజీ కుష్ గంజాయి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. 2024-25లో పలు కేసుల్లో 2010.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దానంతటిని కాల్చివేసినట్లు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్ పర్సన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. మొత్తం 74 కేసుల్లో రూ.10,05,06,750 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.

Related posts

గత పాలకులు పాలమూరును నిర్లక్ష్యం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన!

Ram Narayana

ఖమ్మంలో మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన టీయూడబ్ల్యూజే నేతలు

Ram Narayana

రూ.14 కోట్ల ఆస్తి కంచి పీఠానికి.. ఆదర్శంగా నిలిచిన ఖమ్మం ఉపాధ్యాయుడు…

Ram Narayana