Rain Alert
తెలంగాణ వార్తలు

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలేనట..!

తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. రాబోయే మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది ఐఎండీ. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. అలాగే భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వానలు పడుతాయని చెప్పింది. అలాగే, ఈ నెల 23, 24 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ వివరించింది.

Related posts

కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు… 18న ఆ నలుగురి వాంగ్మూలం నమోదు!

Ram Narayana

మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య: తెలంగాణ డీజీపీ

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై భట్టి ఆగ్రహం …

Ram Narayana